Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

Advertiesment
spinach

సిహెచ్

, మంగళవారం, 18 నవంబరు 2025 (22:55 IST)
ప్రతి సీజన్‌కి కొన్ని రకాల కూరగాయలు ప్రత్యేకంగా వుంటుంటాయి. ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో 7 కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుందాము.
 
పాలకూర: పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.
 
తోటకూర: తోటకూరలో కాల్షియం, బీటాకెరోటిన్, విటమిన్ - సి కూడా పుష్కలంగా ఉంటాయి. ఆకుకూరలద్వార లభించే కెరోటిన్ మనశరీరంలో విటమిన్-ఎగా మారి అంధత్వం రాకుండా చేస్తుంది.
 
గోంగూర: షుగర్‌తో ఇబ్బందిపడేవారు గోంగూరతో తయారుచేసిన ఆహారపదార్థాలు తింటే చాలా మంచిది. గోంగూరలో క్యాల్షియం ఉంటుంది, ఇది ఎముకలు బలంగా మారేందుకు ఉపయోగపడుతుంది.
 
ముల్లంగి: ముల్లంగి గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కిడ్నీ వ్యాధులు, మూలవ్యాధి, కామెర్లు మొదలైనవాటిని నయం చేస్తుంది. ముల్లంగి ఆకుకూరలు మధుమేహానికి ఉత్తమ ఔషధం. ముల్లంగిలో మలబద్దకాన్ని నయం చేసే శక్తి ఉంది.
 
కారెట్: కేన్సర్‌ నిరోధకంగా పనిచేసే అతిగొప్ప కూరగాయ క్యారెట్‌. గుండెజబ్బును నివారించడంలోనూ చక్కగా పని చేస్తుంది. చర్మానికి పోషణ ఇస్తుంది. 
 
బీట్‌రూట్: నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. హైబీపీ వున్నవారికి బీట్ రూట్ మంచిదే అయినప్పటికీ అధిక రక్తపోటుకు మందులు వాడే వారు బీట్ రూట్‌ను తక్కువగా తీసుకోవాలి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్