Publish Date: Mon, 19 Aug 2019 (19:09 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (19:11 IST)
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఆరోగ్యవంతమైన శరీరముంటే ఏ పనైనా సాధించవచ్చు. ఆరోగ్యానికి మూలం మన రోగనిరోధక వ్యవస్థ. దానిని జాగ్రత్తగా చూసుకుంటే ఎలాంటి ఇబ్బందులూ రావు. తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోనివారు, పొగత్రాగడం, మద్యం సేవించడం, విటమిన్ లోప ఉన్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది.
ఈ వ్యవస్థ తిరిగి సక్రమంగా పని చేసేందుకు సమపాళ్ళలో పోషక పదార్థాలను శరీరానికి అందించాల్సి ఉంటుంది. అందులో ఒక్కొక్క పదార్థానికి ఒక విశిష్ట గుణముంది. ముఖ్యంగా, మామిడి, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లు ద్వారా ఎ విటమిన్, నిమ్మ, ఉసిరి వంటి వాటిద్వారా జింక్, బాదం, కిస్‌మిస్ వంటి వాటి ద్వారా మేలు చేసే కొవ్వులు, చేపల ద్వారా ఒమేగా ఫ్యాటీయాసిడ్స్ శరీరానికి పుష్కలంగా అందగలవు.
వీటితో పాటు.. ప్రతి రోజూ ఆహారంలో ఆకు కూరలు, పెరుగు తీసుకోవాలి. వెల్లుల్లికి వైరల్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడే శక్తి ఉంది. మాంసం తింటే బ్యాక్టీరియాతో వచ్చే వ్యాధులు అరికడుతుంది. ఆల్చిప్పలవంటి వాటిద్వారా ఫ్లూవ్యాధిని నిరోధించే సెలేనియమ్‌ని పొందగలరు. ఇలా కొన్ని రకాల పండ్లు, కూరగాయలను తీసుకోవడం వల్ల రోగాల బారినపడుకుండా జాగ్రత్తగా ఉండొచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
webdunia
Publish Date: Mon, 19 Aug 2019 (19:09 IST)
Updated Date: Mon, 19 Aug 2019 (19:11 IST)