Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

ఏ పదార్థాల్లో ఏమేమి వున్నాయో తెలుసుకుని తింటే...?

Advertiesment
Foods
, సోమవారం, 19 ఆగస్టు 2019 (15:24 IST)
ఆరోగ్యంగా వుండాలనుకునేవారు ఇటీవలి కాలంలో ఏవేవో ఆంక్షలు విధించుకుని తినడం చేస్తున్నారు. ఐతే ఏ పదార్థాల్లో ఏమేమి వున్నాయో తెలుసుకుని వాటిని తీసుకోవడం చేయాలి. అలాంటివి ఏమిటో చూద్దాం. 
 
బీన్స్‌లో ప్రోటీన్స్, పీచుపదార్ధము, విటమిన్లు, మినరల్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ... ఇవన్నీ బీన్స్‌లో సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొవ్వుకు సంబంధించిన చెడు లక్షణాలు ఉండవు. క్యాన్సర్ రాకుండా తోడ్పడుతాయి. డయాబెటీస్‌తో పొరాడుతాయి. షుగర్ లెవల్స్ సమతుల్యముగా ఉండేటట్లు చూస్తూనే సురక్షితమైన, నిలకడ అయిన నెమ్మదిగా ఖర్చయ్యే శక్తిని అందిస్తాయి. బీన్స్‌తో చేసిన కూరలు తిన్నప్పుడు కడుపు నిండినట్లు ఉంటుంది గాని అధిక క్యాలరీలు లేకపోవడం వలన బరువు పెరిగే సమస్యే ఉండదు.
 
టొమాటోలోని లైకోపిన్‌ కాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది. గుండె , రక్తనాళాలకి సంబంధించిన అనారోగ్యాన్ని కూడా నిరోధిస్తుంది. మన చర్మానికి ఎండ తాలూకు ప్రభావాలనుండి రక్షించడములో మిగతా పోషకాలతో పాటు టమాటోల పాత్ర చెప్పుకోదగినదే .
 
వాల్ నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ప్లాంట్ స్టెరోల్స్ సమృద్ధిగా ఉంటాయి . కొలెస్టరాల్ లెవల్ తగ్గించడంలో వీటి పాత్ర అమోఘం. వాల్నట్స్ పీచుపదార్థము. ఇందులో మెగ్నీషియం, కాపర్, ఫోలేట్, విటమిన్‌-ఇ ఉండి శక్తివంతమైన యాంటి ఆక్షిడెంట్స్‌ని శరీరానికి అందిస్తాయి. బ్లడ్ ప్రషర్ తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండ ఆపుతుంది. గుండె ఆరోగ్యాన్ని, చర్మానికి ఎండనుండి కలిగే హాని నుండి కాపాడుతుంది .
 
టీ ఓ సూపర్ డ్రింక్. బ్లడ్ ప్రెషర్ని కొంత తగ్గిస్తుంది. ఆస్టియోపొరోసిస్ రాకుండా ఆపుతుంది, గుండె ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. చర్మానికి ఎండచేసే హానిని నిరోధిస్తుంది. చర్మాన్ని అంత త్వరగా ముడతలు పడనివ్వదు. కళ్ళకు మెరుపు అందిస్తుంది. కేటరాక్ట్ ముదరటాన్నీ నెమ్మదింపచేస్తుంది. 
 
పెరుగులో ప్రోటీన్‌, కాల్షియం, విటమిన్‌-బి లను అందిస్తుంది. ఇవన్నీ కలిసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. ఇన్పెక్షన్‌ కలగకుండా పోరాడతాయి. పైగా క్యాన్సర్, ఎలర్జీలు, అధిక రక్తపోటు, హై-కొలెస్ట్రాల్ బారిన పడకుండా కాపాడుతుంది.
 
నేరేడుపండ్లు వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి. వృద్ధులవుతున్నకొద్దీ మెదడు నెమ్మదించే అవకాశమున్నది. అలాంటి అనారోగ్యల నుండి కాపాడుతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీతాఫలంతో టీబీ మటాష్.. శస్త్రచికిత్సకు తర్వాత ఈ ఫలాన్ని తింటే?