అసలు నిద్రలో ఏం జరుగుతుందంటే..?

శనివారం, 20 ఏప్రియల్ 2019 (10:08 IST)
నిద్రలేమికి పలు కారణాలు వివిధ రకాలుగా ఉన్నట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్రలేమి సమస్య కారణంగా కొంతమంది రాత్రుళ్ళు ఎక్కువ సమయం మేల్కొని ఉండడం, తర్వాత ఎప్పుడో నిద్రపోవడం జరుగుతుంది. కానీ ప్రతిరోజూ రాత్రి దాదాపుగా 7 గంటల వ్యవధిలో గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. అంతేకాదు శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర అవసరం కూడా. 
 
నిద్రలేమి సమస్యకు ఒత్తిడి, జీవనశైలి, శారీరక మానసిక రుగ్మతలు, డైట్ వంటివి కారణాలు కావొచ్చు. కారణాలు ఏవైనా, రెగ్యులర్‌గా, సమయానుసారం తగినంత నిద్రపోవడం చాలా అవసరం. నిద్రలేమి వలన మానసికంగాను, శారీరకంగాను అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఏరకంగా నిద్రపోతున్నారు, ఎంతసేపు నిద్రిస్తున్నారు అన్న విషయాన్ని ట్రాక్ చేయడం చాలా ముఖ్యం. 
 
ఈ నిద్రలేమి సమస్య దీర్ఘకాలం నుండి కొనసాగుతున్నట్టయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. వెంటనే చికిత్స తీసుకోవడం ప్రారంభించాలి. లేకుంటే.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వ్యాధినిరోధకశక్తి తగ్గిపోవడం, మెమొరీ లాస్ వంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అసలు నిద్రలో ఏం జరుగుతుందంటే..?
 
చక్కగా నిద్రపోతున్నప్పుడు గుండె, ఊపిరితిత్తులు, రక్తప్రసరణ వ్యవస్థ తప్ప మెదడుతో సహా మిగిలిన వ్యవస్థలన్నీ బాగా విశ్రాంతి పొందుతుంటాయి. విశ్రాంతిలో శరీరంలోని అవయవాలు తిరిగి శక్తిని పొందుతాయి. నిద్రి సరిగ్గా లేకపోతే అనవసర ఆలోచనలతో మనస్సు శాంతి కోల్పోతుంది. శరీరానికి అలసట, తీరిక రోజు రోజుకు అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. అందుకే కంటినిండా నిద్రపోవాలి అంటారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పురుషులకు పుచ్చకాయలు కావాల్సిందే... ఎందుకంటే?