Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రెయిన్ ట్యూమర్‌తో క్రికెటర్ మృతి...

Advertiesment
Con de Lange
, శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:50 IST)
క్రికెట్ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. బ్రెయిన్ ట్యూమర్‌తో ఓ క్రికెటర్ చనిపోయాడు. గత యేడాది కాలంగా ఈ వ్యాధితో పోరాడుతూ వచ్చిన ఆ క్రికెటర్ శుక్రవారం తుదిశ్వాస విడిచాడు. అతని పేరు కాన్ డి వెట్ లాంజ్. స్కాట్లాండ్ క్రికెటర్. వయసు 38 యేళ్లు. స్కాంట్లాండ్ తరపున 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన లాంజ్... నవంబరు 2017వ తేదీన ఆఖరి మ్యాచ్ ఆడాడు. 
 
దక్షిణాఫ్రికా దేశంలోని కాప్ ప్రావిన్స్‌లో బెల్‌విల్లేలో 1981 ఫిబ్రవరి 11వ తేదీన జన్మించిన కాన్ స్కాట్లాండ్ జట్టులో ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు. ఈయన 1998లో శ్రీలంకతో తొలి ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ ఆడాడు. జాతీయ జట్టుకు తొలిసారిగా 2015-17 మధ్య జరిగిన ఐసీసీ ఇంటర్నేషనల్ కప్‌లో తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. జూన్ 2015న ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్. ఐర్లండ్‌పై తొలి టీ20 ఆడాడు. అంతేకాదు, స్కాట్లాండ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. కాన్ మృతికి క్రికెట్ ప్రపంచం సంతాపం తెలిపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాధ్యతల నుంచి తప్పుకోనున్న సౌరవ్ గంగూలీ