టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రియమైన పానీయాలలో ఒకటి. ఐతే ఆ టీని అతిగా తాగడం వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
ఐరన్ లోపం అనేది సాధారణ పోషకాహార లోపాలలో ఒకటి, అధికంగా టీ తీసుకోవడం ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
టీ మోతాదుకి మించి తాగితే ఆందోళన, ఒత్తిడి మరింత పెరుగుతుంది, విశ్రాంతి లేకుండా చేస్తుంది.
టీలో సహజంగా కెఫిన్ వుంటుంది, అధికంగా తీసుకోవడం వల్ల ఇది నిద్రకు భంగం కలిగిస్తుంది.
ఖాళీ కడుపుతో టీ తాగితే అందులో వున్న కొన్ని సమ్మేళనాలు వికారం కలిగించవచ్చు.
టీలోని కెఫిన్ గుండెల్లో మంటను కలిగించవచ్చు, ముందుగా ఉన్న ఎసిడిటీ సమస్యలను తీవ్రతరం చేస్తుంది.
గర్భధారణ సమయంలో టీని మోతాదుకి మించి తాగితే అధిక స్థాయి కెఫిన్‌కు గురై సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది.
అధిక మోతాదులో టీ తాగితే అందులోని కెఫిన్ కారణంగా తల తిరగడం, కళ్లు తిరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.