Publish Date: Sat, 23 May 2020 (15:33 IST)
Updated Date: Sat, 23 May 2020 (15:34 IST)
పుదీనాలో విటమిన్ ఎ, సి, ఫోలేట్‌లతో పాటు మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ లాంటి సూక్ష్మ పోషకాలుంటాయి. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుదీనా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పుదీనా ఆకుల్లో ఫినోలిక్ సమ్మేళనాలు మెండుగా వుంటాయి. ఇవి రుగ్మతలను తగ్గిస్తాయి. నిమ్మరసం, పండ్ల రసాలు, మజ్జిగ, టీ... వీటితో కలిపి పుదీనాను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలను పొందొచ్చు.
దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు కప్పు పుదీనా టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. గర్భిణుల్లో సాధారణంగా కనిపించే మార్నింగ్ సిక్‌నెస్‌ను పుదీనా తగ్గిస్తుంది. ఉదయం టీలో లేదా మజ్జిగలో ఈ ఆకులను వేసుకుని తాగితే వికారం, వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని తగ్గిస్తుంది. పుదీనా నూనె, ఆకుల సువాసనను ఆస్వాదించడం వల్ల అలసట, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. ఇది మెదడును ఉత్తేజంగా ఉంచుతుంది. దాంతో శరీరం చురుగ్గా మారుతుంది.