Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వేసవిలో భానుడి భగభగ, ఏమేమి చేయాలి? చేయకూడదు? (video)

Advertiesment
వేసవిలో భానుడి భగభగ, ఏమేమి చేయాలి? చేయకూడదు? (video)
, శనివారం, 23 మే 2020 (14:10 IST)
శుక్రవారం రోహిణి కార్తీ ప్రారంభమైంది. రోహిణి కార్తెలో ఎండ దెబ్బకు రోళ్లు కూడా బద్ధలవుతాయనే సామెత వుంది. పరిస్థితి కూడా అలాగే వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గురువారం నాడు హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 44 డిగ్రీలుండగా అది శుక్రవారం నాటికి 45కి చేరింది. రాబోయే రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెపుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎండ తీవ్రత సమయంలో బయటకు రాకపోవడం మంచిది.
 
వేసవి తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో ఏమేం చేయాలి? ఏమేం చేయకూడదు అన్న అంశాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఆ వివరాలు...
 
చేయవలసినవి:
▶ వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి.
▶ తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి.
▶ నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి.
▶ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకొజు కలిపిన నీరు త్రాగవచ్చును, లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము త్రాగవచ్చును.
▶ వడదెబ్బకు గురి అయినవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చాలి.
▶ వడదెబ్బకు గురి అయినవారని తడిగుడ్డతో శరీరం అంతా రుద్దుతూ ఉండాలి. ఐస్ నీటిలో బట్టను ముంచి శరీరం అంతా తుడవవలెను శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారట్ హీట్ కంటే లోపునకు వచ్చేవరకు ఐస్ వాటర్ బట్టతో శరీరాన్ని తుడుస్తూ ఉండాలి మరియు ఫ్యాను క్రింద ఉంచాలి. 
▶ వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించవలెను.
▶ మంచి నీరు ఎక్కువ సార్లు త్రాగాలి.
▶ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు త్రాగాలి.
▶ ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే ఒక మాదిరైన చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు త్రాగాలి.
▶ తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు తలతిరుగుట మొదలైన అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్నా వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవచ్చును.
 
చేయకూడనివి:
▶ సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు.
▶ వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు.
▶ వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు.
▶ నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు.
▶ వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు. దగ్గరలోని ప్రాధమిక అరోగ్య కేంద్రానికి చేర్చుటలో ఏ మాత్రం అలస్యం చేయరాదు.
▶ మధ్యాహ్నం తరువాత (అనగా ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల మధ్యకాలంలో) ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు.
▶ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకొన కూడదు. శీతలపానీయములు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ సేవ్ చేయాలంటే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే చాలు