Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మునగాకు పొడిని ఇలా వాడితే? మోరింగా టీ తాగితే? (video)

Advertiesment
Moringa leaves
Moringa Tea
మునగాకు పొడిలో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, ఖనిజాలు పుష్కలంగా వుంటాయి. ఇది అద్భుతమైన మూలికా సప్లిమెంట్. చాలామంది దీనిని పోషక పదార్థంగా ఉపయోగిస్తున్నారు. ఉబ్బసం లక్షణాలను తగ్గించడం నుండి తల్లిలో పాల ఉత్పత్తిని పెంచడం వరకూ ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది
 
కానీ మునగాకు పౌడర్ నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే.. దాన్ని నేరుగా తీసుకోవటం, ఇష్టమైన ఆహారాలు లేదా డ్రింక్స్‌తో కలిపి తీసుకోవడం మంచిది. ఎక్కువగా వేడి చేస్తే పోషకాలు తగ్గిపోతాయి.. కాబట్టి దీన్ని ఉడికించకుండా తీసుకోవడం మంచిది. మునగ ఆకులని శుభ్రం చేసి, కొన్ని నిమిషాల పాటు వాటిని నీటిలో ఉడకబెట్టి మోరింగా టీ తయారు చేసుకోవచ్చు. 
 
మునగాకు పొడి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తద్వారా ఇది అధికంగా గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి రెగ్యులర్‌గా మునగాకు టీతో తాగడం అలవాటు చేసుకుంటే ఒబిసిటీ తగ్గడమే కాకుండా.. అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కాలం.. బొప్పాయిలో బోలెడు ప్రయోజనాలు.. వ్యాధినిరోధక శక్తి కోసం?