డయాబెటిస్ రోగులు అరటిపండు తినొచ్చా? (video)
అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మళ్లీ ఆ చక్కెర స్థాయిలు తగ్గాలంటే..
అరటిపండులో కార్బొహైడ్రేట్లు పుష్కలంగా వుంటాయి. ఇవి కొవ్వును ఉత్పత్తి చేస్తాయి. మధుమేహం ఉన్నవారు అరటి పండ్లను తింటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. మళ్లీ ఆ చక్కెర స్థాయిలు తగ్గాలంటే.. లివర్, మూత్రపిండాలపై అధిక భారం పడుతుంది.
కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకపోవడమే మంచిది. లేకుంటే చక్కెర స్థాయిలు పెరిగి తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అలాగే ఒబిసిటీతో బాధపడేవారు అరటిపండ్లు తినకూడదు. తద్వారా బరువు పెరుగుతారు. గుండె సమస్యలు వున్నవారు కూడా వీటిని తీసుకోకపోవడం మంచిది. అరటి పండ్లలో థయామిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్నవారికి మంచిది కాదు. దీని వల్ల తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది.
అది నాడీ వ్యవస్థకు మేలు చేయదు. అరటిపండ్లలో ఉండే పొటాషియం కిడ్నీలపై భారం పెంచుతుంది. తద్వారా కిడ్నీలు త్వరగా పాడైపోయేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మూత్రాశయ, మూత్ర పిండాల సమస్యలున్నవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.