మునగాకుతో థైరాయిడ్ పరార్.. కాలేయానికి దివ్యౌషధం

గురువారం, 2 జనవరి 2020 (16:26 IST)
శరీరంలోని కాలేయం ఆరోగ్యంగా ఉంటే అనారోగ్య సమస్యలంటూ వుండవని వైద్యులు చెప్తున్నారు. అలాంటి కాలేయాన్ని కాపాడుకోవాలంటే.. మునగాకును ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. మత్తు మందులు తీసుకోవడం, సిగరెట్ పీల్చే వారు వాటిని తప్పకుండా పక్కనబెట్టాలని.. మునగాకును రోజూ తీసుకోవాలి. ఇంకా థైరాయిడ్‌కు చెక్ పెట్టాలంటేనూ మునగాకే దివ్యౌషధం. 
 
శరీర పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. ముఖ్యంగా మన గొంతుభాగంలో ఉండే థైరాయిడ్‌ గ్రంథి గురించి దాని పని తీరులో తేడాల వల్ల థైరాయిడ్‌ సమస్య వస్తుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి హైపోథైరాయిడిజం, ఈ రోజుల్లో ఇదే ఎక్కువగా వుంటోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మాత్రలతోపాటు ఆహారపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
 
నీరసం, అలసట, మానసికంగా కుంగి పోవడం, బరువు పెరగడం, చల్లదనం భరించలేకపోవడం వంటివి థైరాయిడ్ లక్షణాలు. ఈ లక్షణాలు వున్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. మునగాకు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే మునగాకు ఒత్తిడిని మటాష్ చేస్తుంది. అనీమియా దూరం చేస్తుంది. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీలను మునగాకు ఆరోగ్యంగా వుండేలా చేస్తుంది. ఆస్తమా, డయాబెటిస్, హృద్రోగ సమస్యలను దరిచేరనివ్వదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం పాలకూర జ్యూస్‌ తాగితే బరువు తగ్గుతారు.. తెలుసా?