Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భోజనం ఎలా చేయాలంటే..?

Advertiesment
eating
రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో పోషకాలు ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యానికి తగిన శక్తినిచ్చే ఆహారం తీసుకున్నట్లవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  భోజనం ఎలా చేయాలనే విషయాలను ఆరోగ్య నిపుణులు ఈ కింద పద్ధతులలో చెప్పున్నారు. అవేంటో చూద్దాం.
 
1. ప్రస్తుతం జీవితం ఉరుకులు పరుగులమయమై అస్తవ్యస్తంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో భోజనానికి ఓ షెడ్యూలును రూపొందించుకోండి. అందునా క్రమపద్ధతిలో భోజనం చేస్తూ, తగిన పోషక పదార్థాలుండేలా చూసుకోవాలంటున్నారు ఆరోగ్యనిపుణులు
 
2. ఉదయంపూట అల్పాహారం తీసుకోవాలి. కానీ ఎక్కువగా తినకూడదంటున్నారు వైద్యులు.
 
3. భోజనం చేసేటప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో భోజనం ద్వారా లభించే పోషక తత్వాలు శరీరానికి చేరుతాయంటున్నారు వైద్యులు. 
 
4. మీకు ఆకలి ఎంత వేస్తే అందులో సగభాగం మాత్రమే ఆహారం తీసుకోవాలి. 1/4 వంతు భాగంలో నీటిని సేవించాలి. మిగిలిన 1/4 వంతు ఖాళీగా ఉంచాలి. 
 
5. భోజనానంతరం అరగంట తర్వాత మాత్రమే నీటిని కడుపారా త్రాగండి. మధ్యలో నీళ్ళు తాగాలనిపిస్తే కాసింత నీటిని సేవించాలి.
 
6. భోజనానికి ముందు, తర్వాత నీటిని సేవిస్తే జీర్ణక్రియలో మార్పులు సంభవించి జీర్ణక్రియ శక్తి తగ్గుతుంది.
 
7. భోజనంలో పప్పు దినుసులు, ఆకు కూరలు, పెరుగు, సలాడ్‌లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మగాడు అందుకు పనికిరాడని ఇలా తెలుసుకోవచ్చు..?