Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉప్పుతో అలాంటి వారు చాలా జాగ్రత్తగా వుండాలి...

Advertiesment
salt
, శుక్రవారం, 11 జనవరి 2019 (12:38 IST)
ఉప్పు ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తుంటారు. అది వాస్తవమే.. అందుకని ఉప్పును అలానే వదిలేయలేము కదా. ఉప్పు లేని కూరంటూ ఉండదు. ఇంకా చెప్పాలంటే.. ఉప్పులేని కూర అసలు కూరే కాదు. ఉప్పు వలన కొన్ని నష్టాలున్నా.. మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అవేంటో చూద్దాం..
 
1. విషాహారం తిన్నవారికి వాంతి అవడానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. గ్లాస్ నీళ్ళల్లో మూడు నాలుగు స్పూన్ల ఉప్పు కలిపి తాగితే కొన్ని నిమిషాల్లో వాంతి అవుతుంది.
 
2. ఉప్పు కలిపిన నీళ్ళను యాంటీ సెప్టిక్‌గా ఉపయోగించవచ్చు. ఇంట్లో మరో యాంటీ సెప్టిక్ ఏది లేకపోతే రసికారే పుండ్లను ఉప్పునీటితో కడగవచ్చు. బేండేజ్ గానీ, బట్టగానీ పుండుకు అంటుకుపోతే, గోరువెచ్చని ఉప్పు నీటితో కొన్ని నిమిషాల పాటు కడిగితే ఊడి వచ్చేస్తుంది.
 
3. చెడుశ్వాస, ఎడతెగని గొంతునొప్పి, చిగుళ్ళావాపు ఉన్నవారు ఉప్పునీటిని పుక్కిలిస్తే చాలా మంచిది. 
 
4. పదిమందిలో మాట్లాడేటప్పుడు, పాట పాడేటప్పుడు కొందరికి గొంతుపట్టుకుంటుంది. అలాంటి వారు చిటికెడు ఉప్పు నాలుకపై వేసుకుని చప్పరిస్తే గొంతు సాఫీగా ఉంటుంది.
 
5. తాపంగా ఉన్న అవయవాలకి, నొప్పిపుడుతున్న కీళ్ళకు వేడిఉప్పు నీటి కాపడం మంచిది.
 
6. కళ్ళకు ఇన్‌ఫెక్షన్స్ అయి పుసులు కడుతుంటే, ఓ గ్లాస్ గోరువెచ్చని నీటిలో మూడు నాలుగు చిటికెల ఉప్పు కలిపి, ఆ ద్రవంలో దూదిని ముంచి దానితో కళ్ళను శుభ్రపరచుకోవాలి.
 
7. అధికరక్తపోటు కలవారు, హృద్రోగాలు, కాళ్ల వాపు, మూత్రపిండాల వ్యాధులేమైన ఉన్నవారు ఉప్పును ఆహారంలో జాగ్రత్తగా తీసుకోవాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొప్పవారు లోకహితంకోసం..?