Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పురుషుల కన్నా స్త్రీలలోనే డిప్రెషన్ ఎక్కువ, తగ్గాలంటే?

పురుషుల కన్నా స్త్రీలలోనే డిప్రెషన్ ఎక్కువ, తగ్గాలంటే?
, బుధవారం, 11 డిశెంబరు 2019 (21:44 IST)
మానసిక ఒత్తిడిని డిప్రెషన్ అంటారు. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా మానసిక ఒత్తిడులకు గురి అవుతారంటున్నారు వైద్య నిపుణులు. పురుషులు అయితే త్వరగా బాధల నుంచి బయటపడగలరట. కానీ స్త్రీలు వాటిని అంటిపెట్టుకునే ఉంటారట. వియోగ బాధ నుంచి కూడా పురుషులు బయటపడ్డంత త్వరగా స్త్రీలు బయటపడలేరట. 
 
డిప్రెషన్ వల్ల పనిచేసే సాహసం చేయలేమట. ప్రత్యేక ప్రయత్నం చేసి కొత్తపని మొదలుపెట్టలేరట. మానసికంగా పుల్ స్టాప్ పడుతారట. పురుషుల కంటే స్త్రీలు భావనాత్మకంగా ఇతరులతో ముడి పడి ఉంటారు. తమ మనస్సులోని మాట చెప్పేసి ఇతరులతో సంబంధం ఏర్పరచుకోవడం వారిపై ఆధారపడి ఉండడం చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకుంటారు.
 
స్త్రీలు ఇప్పుడు వంటింటి పనులే కాకుండా బయట ప్రపంచంలో అడుగుపెట్టారు. అందువల్ల మానసిక బంధాలకు పురుషుల వలే అతీతంగా ఉండగలుగుతున్నారు అనే వాదన ఉంది. కానీ అది ఎంతమాత్రం నిజం కాదంటున్నారు వైద్య నిపుణులు. 1975సంవత్సరంలో జరిగిన సర్వే ద్వారా ఆఫీసులో పనిచేసే వనితలు కూడా డిప్రెషన్ కు గురి అవుతున్నారట. ఇంటా బయటా పనిచేస్తున్నా స్త్రీల మానసిక స్థితిలో మార్పు లేదట. 
 
ఒక వ్యక్తి మానసికంగా ఒక వస్తువుతో గానీ, వ్యక్తితో కానీ ముడిపడినప్పుడు ఆ వస్తువు లేదా వ్యక్తిని పొగొట్టుకుంటే పోతున్నదన్న భయం పట్టుకుంటే డిప్రెషన్ కు గురి అవుతారట. ఈ డిప్రెషన్ మూడు నెలల కంటే ఉండదట. ఎక్కువ కాలం డిప్రెషన్ కొనసాగితే మానసిక రోగంగా రూపు దాల్చే ప్రమాదం ఉందట. నిరాశ, నిస్పృహ వల్ల ఇలాంటి స్థితి ఏర్పడుతుందట. ఆత్మన్యూనతాభావం కలుగుతుందట. తను ఎందుకూ పనికిరానని అనుకుంటుందట. శక్తిహీనురాలని భావిస్తుందట. 
 
అయితే ఎందులోనైనా విఫలమైనంత మాత్రాన మనం ఎందుకూ పనికిరామని అనుకోవడం పొరపాటు అంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి వారికి నెగిటివ్ ఆలోచనలు అవసరమట. తార్కికంగా ఆలోచిస్తే డిప్రెషన్ త్వరగా తగ్గిపోతుందట. అనేకసార్లు డిప్రెషన్ ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రపోతేనే దూరమవుతుందట. ప్రార్థన చెయ్యడం వల్ల, చింతన వల్ల మనస్సు నిర్మలమవుతుందట. వాస్తవిక స్థితిని అర్థం చేసుకుంటే డిప్రెషన్ అసలు ఉండదట. నిజానికి చురుకుదనం, సజావుగా కార్యనిర్వహణ చేయడం స్త్రీలలో ఎక్కువట. దోషరహితంగా పనులు కావాలంటే మహిళల చేతులు మీదుగానే జరగాలి. మనస్సులో నిక్షిప్తమైన చురుకుదనాన్ని ఆత్మవిశ్వాసాన్ని గుర్తించనప్పుడే డిప్రెషన్ బాధ ఉండదంటున్నారు వైద్యులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భోజనం వేగంగా చేస్తే బరువు పెరుగుతారా?