రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకుంటే.. తేనే, మిరియాల పొడిని?
అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను కలిపి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది.
అలసిపోయిన శరీరానికి తక్షణ ఉపశమనం పొందాలంటే, ఒక స్పూన్ పంచదారలో రెండు స్పూన్ల పంచదారను కలిపి బాగా మిక్స్ చేసుకుని తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అలసిపోయిన శరీరానికి ఉత్సాహాన్నిస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునే వారు... రోజూ అర స్పూన్ జీలకర్రను.. పెరుగులో చేర్చి తీసుకుంటే ఒబిసిటీ మటాష్ అవుతుంది. రాత్రిపూట పెరుగు తీసుకోవాలనుకునేవారు ఓ కప్పు పెరుగులో అర స్పూన్ తేనే, అరస్పూన్ మిరియాల పొడిని కలిపి తీసుకోవాలి. పగటి పూట పెరుగును తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలుగుతుంది.
కానీ రాత్రి పూట పెరుగును తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుందట. దీని వల్ల జలుబు, అధిక కఫం వంటి సమస్యలు వస్తాయట. అందుకే రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిది. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం మిరియాల పొడి, తేనెను కలిపి తీసుకోవడం ద్వారా జలుబు, కఫం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా శరీరం నుంచి అధిక ఉష్ణం బయటకు వెళ్లిపోతుంది. అంతేకాకుండా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. కడుపులో మంట తొలగిపోతుంది. శారీరక దృఢత్వం కలుగుతుంది. పెరుగులో పుష్కలంగా లభించే కాల్షియం ఎముకలకు చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.