Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపర్(రాగి) పాత్రలు వుపయోగిస్తే కరోనా వైరస్ ఔట్...

Advertiesment
కాపర్(రాగి) పాత్రలు వుపయోగిస్తే కరోనా వైరస్ ఔట్...
, మంగళవారం, 17 మార్చి 2020 (20:40 IST)
రాగి పాత్రల్లో భోజనం, వంట అనేది ఎంతో ఆరోగ్యకరమైన విషయం అని మన పూర్వీకులు చెప్పారు. కొన్నిచోట్ల ఇప్పటికీ రాగి పాత్రలను ఉపయోగించడం చూస్తుంటాం. ఐతే ఆ తర్వాత వాటి స్థానంలో స్టీలు, అల్యూమినియం ఇతర పాత్రలు వచ్చి చేరాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను రాగి పాత్రలతో పారదోలవచ్చట.
 
ఇన్ ఫ్యూయంజా, ఈ కోలి వంటి బ్యాక్టీరియాలతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కూడా ఏదైనా గట్టి ఉపరితలంపై పడినట్లయితే అవి నాలుగు నుంచి ఐదు రోజుల వరకు మనుగడ సాగించగలవు. కానీ ఇలాంటి వైరస్ రాగిపై లేదా ఇత్తడి వంటి కాపర్ మిశ్రమాలపై పడితే కొన్ని నిమిషాల్లోనే చనిపోతుందని సౌతాంఫ్టన్ యూనివర్శిటీ లోని ఎన్విరాన్మెంటల్ హెల్త్ కేర్ ఫ్రొఫెసర్ బిల్ కీవిల్ వెల్లడించారు. కనుక రాగి పాత్రలను ఉపయోగించడం ఉత్తమమని అంటున్నారు.
 
ఇకపోతే రాగి పాత్రలతో వుండే ప్రయోజనాలు ఏమిటో చూద్దాం. రాగి చెంబులో నీరు తాగడం వల్ల శరీరంలోని రోగకారకాలను దూరం చేస్తుంది. రాగి చెంబుతో నీటిని సేవించడం, రాగి పాత్రల్లో ఆహారం తీసుకోవడం ద్వారా జ్వరం, జలుబు దరిచేరదు. నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో చక్కెర నిల్వల స్థాయిని క్రబమద్ధీకరిస్తుందని చెపుతారు. 
 
రాగితో చేసిన గాజులు ధరించడం ద్వారా ఇస్నోమియా, న్యూరోసిస్, హైబీపీ వంటి వాటిని నియంత్రించుకోవచ్చు. వివాహం అయిన తర్వాత సంతానలేమి బాధపడేవారు దంపతులు.. రాగి చెంబులు, గ్లాసులు ఉపయోగించడం మేలు. వంటలు చేసేటప్పుడు రాగి పాత్రలను ఉపయోగించవచ్చు. ఫలితంగా దంపతుల శరీరంలో సంతానలేమి గల రుగ్మతలు తొలగిపోయే ఆస్కారం ఉందట. 
 
రాగి చెంబులో రాత్రి పూట నీరు ఉదయం నిద్రలేవగానే తాగడం చాలా మంచిది. అలా తాగితే కడుపులో ఉన్న టాక్సిన్లు తొలగిపోతాయి. తద్వారా ఎసిడిటీ, కిడ్నీ, లివర్ సమస్యలు తగ్గిపోతాయి. రాగి పాత్రల్లో నీటిని వేడిచేసి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా చర్మ సంబంధిత రోగాలు దరిచేరవు. రాగిపాత్రల్లో నీళ్లు వుంచితే వాటిలో క్రిములు చేరే అవకాశం ఉండదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
రాగి చెంబులో ఉంచిన నీటిని తాగడం ద్వారా నీటి ద్వారా వచ్చే వ్యాధులు నయమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గుతారు. నిత్యయవ్వనులుగా మారుతారట. హృద్రోగ సమస్యలు ఉత్పన్నం కావు. రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్ క్రమంగా వుంటాయి. థైరాయిడ్ సమస్యలు దూరం చేసుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా వైరస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. అల్లం టీ మేలు చేస్తుందా?