దేశంలో కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలనే దానిపై వైద్యులు క్లారిటీ ఇస్తున్నారు. కరోనా వ్యాధి సోకకుండా వుండాలంటే.. ఉదయం, సాయంత్రం పూట అల్లాన్ని బాగా దంచి వేడినీటిలో మరిగించి.. లేదా టీలో చేర్చి తీసుకోవాలి. అల్లం టీని లేదా అల్లం మరిగించిన నీటిని రోజుకు ఓసారైనా సేవించడం చేయాలి.
అలాగే ఇతర దేశాలకు చెందిన పండ్లను తీసుకోకపోవడం మంచిది. స్వదేశీ పండ్లను తీసుకోవడం మంచి ఫలితాన్నిస్తుంది. కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలి. పాలలో అల్లం, పసుపు పొడి, మిరియాల పొడి, యాలకులు, ఎండుద్రాక్షలు కలుపుకుని సేవించడం మంచిది. నిమ్మరసాన్ని డైట్‌లో చేర్చుకోవడం మంచిది.
తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. జామపండు, బత్తాయి, ఉసిరికాయను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా కరోనా నుంచి తప్పించుకునే శక్తి లభిస్తుంది. విటమిన్ సి కలిగిన పండ్లు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా కరోనాకు దూరంగా వుండవచ్చునని ఆరోగ్య నిపుణులు సెలవిస్తున్నారు.