Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు.. ఏం చేస్తున్నారంటే?(ఫోటోలు)

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా టిటిడి విస్తృత ఏర్పాట్లు.. ఏం చేస్తున్నారంటే?(ఫోటోలు)
, మంగళవారం, 17 మార్చి 2020 (19:32 IST)
తిరుమలలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాల మేరకు అదనపు ఈఓ ఎ.వి.దర్మారెడ్డి పర్యవేక్షణలో టిటిడిలోని అన్ని విభాగాలు పటిష్ట చర్యలు చేపట్టింది. 
webdunia
ముఖ్యంగా టైంస్లాట్ టోకెన్లు ద్వారా శ్రీవారి దర్సనం కల్పిస్తున్నారు. శ్రీవారి దర్సనానికి వచ్చే భక్తులకు మంగళవారం తెల్లవారుజామున 12గంటల నుంచి టైంస్లాట్ టోకెన్లు జారీ చేసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ఒకటి నుంచి రెండునెలలో వేచి ఉండకుండా నేరుగా శ్రీవారి దర్సనానికి అనుమతించారు. 
webdunia
తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఒక్కొక్క హాలులో వెయ్యిమంది భోజనం చేసే అవకాశం ఉన్న 500మందికి మాత్రమే భోజనం అందిస్తున్నారు. ఇందులో ఒక టేబుల్‌కు నలుగురు కూర్చోవాల్సి ఉంటుంది.
 
ఉద్యోగులు అందరు మాస్కులు ధరించి శానిటైజర్లతో చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటున్నారు. అదేవిధంగా తిరుమలలోని వివిధ ఫుడ్ కౌంటర్లలోను మాస్కులు ధరించి అన్నప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
webdunia
ఇక తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలోని 9 మినీ కళ్యాణకట్టలలో భక్తులు వేచి ఉండగకుండా సత్వరం తలనీలాలు సమర్పించే చర్యలు తీసుకుంటున్నారు. 
 
కళ్యాణ కట్టలోని క్షురకులకు మాస్కులు, డెటాల్, సొల్యూషన్ అందించారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. ప్రధాన కళ్యాణకట్టలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
 
తిరుమలలోని వసతి గృహాలు, అతిథి భవనాలు, వసతి సముదాయాలలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి శుభ్రం చేస్తున్నారు. వసతి గదులను భక్తులు ఖాళీ చేసిన తరువాత ఒక గంటపాటు తగువిధంగా శుభ్రం చేసిన తరువాత మరొకరికి కేటాయిస్తున్నారు.
webdunia
అలిపిరి చెక్ పాయింట్, అలిపిరి నడకమార్గంలోని పాదాల మండపం, శ్రీవారి మెట్టు నడకమార్గం వద్ద కరోనా వ్యాప్తి నివారణ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి భక్తులకు ధర్మల్ స్క్రీనింగ్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 
 
తిరుమలలోని వివిధ ప్రాంతాలలో ప్రథమ చికిత్స కేంద్రాలు, డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, మందులు, ఆంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. ప్రాథమికంగా వైరల్ లక్షణాలను గుర్తిస్తే తిరుమలకు అనుమతించకుండా రుయా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు పంపుతున్నారు. 
webdunia
అంతేకాకుండా కరోనా వ్యాప్తి నివారణకు భక్తులలో అవగాహన కల్పించేందుకు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్, రేడియో అండ్ బ్రాడ్ కాస్టింగ్ విభాగాల ద్వారా తిరుమలలోని ముఖ్య కూడళ్ళలోనూ, రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో నిరంతరాయంగా ప్రచారం చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?