Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వర్షాకాలంలో మొక్కజొన్న తప్పకుండా తినాల్సిందే..

వర్షాకాలంలో ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకుంటే.. కొవ్వును దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ

వర్షాకాలంలో మొక్కజొన్న తప్పకుండా తినాల్సిందే..
, గురువారం, 23 ఆగస్టు 2018 (12:52 IST)
వర్షాకాలంలో ప్రతిరోజూ మొక్కజొన్నను ఆహారంలో చేర్చుకుంటే.. కొవ్వును దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొక్క‌జొన్న‌లు ప‌చ్చివి, కాల్చిన‌వి, ఉడ‌క‌బెట్టిన‌వి ఏవైనా స‌రే మ‌న శ‌రీరంలోని కొవ్వును నియంత్రిస్తాయి. అంతేకాదు వీటిలో ఉన్న లినోలికాసిడ్‌, ఫోలికాసిడ్‌, విట‌మిన్ ఇ, బి1, బి6, నియాసిన్‌, రిబోఫ్లావిన్ వ‌ల్ల చిన్నారుల‌కు, మ‌ధుమేహ‌రోగుల‌కు కూడా ఎంతో మంచింది. జీర్ణ‌క్రియ‌ను మెరుగుపరుస్తాయి. 
 
ఉడికించి తింటే ఏ రకం మొక్కజొన్న అయినా మంచిదే. ఇందులో శక్తిమంతమైన పోషకాలతోబాటు ఎ, బి, సి, ఇ విటమిన్లూ, కొన్ని ఖనిజాలూ కూడా లభ్యమవుతాయి. కార్న్‌కి కాస్త నిమ్మకాయ రాసుకుని తినడంవల్ల వాటిల్లో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు, నియాసిన్ వంటి పోషకాలు శరీరానికి లభిస్తాయి. 
 
మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే థైమీన్‌, నియాసిన్‌ అనే విటమిన్లు నాడీ వ్యవస్థ పనితీరుని మెరుగుపరుస్తాయి. గర్భిణులకు అవసరమైన ఫోలేట్‌ శాతం కూడా మొక్కజొన్నల్లో ఎక్కువేనని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫాస్పరస్ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇంకా మొక్కజొన్నలోని మెగ్నీషియం ఎముకలకు బలాన్నిస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్సానర్‌ నిరోధకాలుగానూ పనిచేస్తాయి. 
 
ఇంకా ఆల్జీమర్స్‌, మధుమేహం, బీపీ, హృద్రోగాలనూ కార్న్ నివారిస్తుందని.. మిగిలిన ఆహారపదార్థాలకు భిన్నంగా ఉడికించడంవల్ల స్వీట్‌కార్న్‌లో యాంటీఆక్సిడెంట్ల శాతం మరింత పెరుగుతుంది. పసుపురంగు కార్న్‌లో కంటికీ చర్మానికీ అవసరమైన బీటాకెరోటిన్‌ సమృద్ధిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వర్షాకాలంలో ఇలా చేయండి.. నిద్రపోయే ముందు ఓ గ్లాస్ నీరుతాగితే...