Publish Date: Wed, 25 Jun 2025 (12:16 IST)
Updated Date: Wed, 25 Jun 2025 (12:19 IST)
తొడ కటి భాగం నుంచి పాదం వరకూ విపరీతమైన నొప్పి వుంటుంది. దీనినే వైద్యులు సయాటికా అని చెబుతుంటారు. దీనిని నివారించేందుకు సరైన జీవనశైలిని అనుసరించడం, సమతుల్య పోషకాహారాలను తీసుకోవడం చేయాలి. అదేవిధంగా కూర్చునేటపుడు సరిగా కూర్చోవడం, నడవడం, శరీరానికి సరైన భంగిమను అనుసరించడం చేయాలి. ఆరోగ్యకరమైన శరీర బరువును కలిగి వుండాలి. బరువులు ఎత్తే సమయంలో సరైన లిఫ్టింగ్ పద్ధతులను పాటించాలి. సయాటికా నొప్పి కారణంగా కండరాలు, నాడులు కదలికలను కోల్పోతాయి, అందువల్ల క్రమం తప్పకుండా యోగా, స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలి.
ఒత్తిడి నిర్వహణ పద్ధతులను పాటించాలి. ధూమపానం, మద్యపానంను మానుకోవాలి. ముఖ్యంగా నరాలపై ఏర్పడిన ఒత్తిడిని తొలగించడానికి వార్మ్ కాంప్రెషన్ లేదా కోల్డ్ కాంప్రెషన్‌లను ఉపయోగించాలి. నిద్ర సమయంలో సౌకర్యంగా, వెన్ను భాగాన్ని సపోర్ట్ చేసే పడకలను ఉపయోగించాలి. వైద్యుల సూచనల మేరకు నొప్పిని నివారించే మందులు కూడా వాడవచ్చు. అయితే మరికొన్ని సందర్భాల్లో సూచించబడిన స్టెరాయిడ్ మందులను తీసుకోవడం ద్వారా కూడా నాడులపై ఒత్తిడి తగ్గి సయాటికా నొప్పిని కొంతమేర తగ్గించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.