Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రధాని శంఖారావానికి దాల్మియా స్పందన, స్టీల్‌ రంగం కోసం మెగ్నీషియా కార్బన్‌ లైన్‌ ఆవిష్కరణ

ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం ప్రధాని శంఖారావానికి దాల్మియా స్పందన, స్టీల్‌ రంగం కోసం మెగ్నీషియా కార్బన్‌ లైన్‌ ఆవిష్కరణ
, మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (20:46 IST)
ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం గౌరవ ప్రధానమంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ పూరించిన శంఖారావానికి స్పందనగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రిఫ్రాక్టరీ కంపెనీ దాల్మియా- ఓసీఎల్‌ లిమిటెడ్‌ నిన్న ఒడిషాలోని రాజ్‌గంగ్‌పూర్‌ ప్లాంట్‌లో ఏర్పాటు చేసిన మెగ్నీషియా కార్బన్‌ (ఎంజీఓ–సీ బ్రిక్స్‌) ఉత్పత్తి కోసం నూతన రిఫ్రాక్టరీ లైన్‌ను ఆవిష్కరించింది. ఉక్కు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగ్గాన్‌ సింగ్‌ కులస్తీ ఈ ఉత్పత్తి లైన్‌ ప్రారంభించారు. దీని ఉత్పత్తి సామర్థ్యం 1,08,000 టన్నులు మరియు దేశీయ స్టీల్‌ తయారీదారుల అవసరాలను ఇది తీర్చనుంది.
 
ఒకసారి పూర్తిగా కార్యకలాపాలు ప్రారంభిస్తే, మెగ్నీషియా కార్బన్‌ బ్రిక్స్‌ ఉత్పత్తి కోసం భారతదేశంలో అతిపెద్ద రిఫ్రాక్టరీ లైన్‌గా నిలువడంతో పాటుగా దేశపు దిగుమతుల భారాన్ని దాదాపు 50% వరకూ తగ్గిస్తుందనే వాగ్ధానం చేస్తుంది. ఈ రిఫ్రాక్టరీ లైన్‌ను దాల్మియా –ఓసీఎల్‌ యొక్క ‘భారత్‌ కీ ఫ్యాక్టరీ మేఁ భారత్‌ కీ రిఫ్రాక్టరీ’ కార్యక్రమానికి అనుగుణంగా ఏర్పాటుచేశారు. ఇది మూడు దశలలో ఒక్కోటి 36వేల టన్నుల సామర్థ్యంతో వస్తుంది. ఈ ఉత్పత్తిని విస్తృతంగా స్టీల్‌ పరిశ్రమ వినియోగిస్తుంది మరియు ప్రస్తుత డిమాండ్‌లో అధికశాతం దిగుమతులు (ప్రతి సంవత్సరం దాదాపు 3 లక్షల టన్నులు) ద్వారానే తీరుతున్నాయి.
 
ఈ కార్యక్రమం క్రింద దాల్మియా-ఓసీఎల్‌-దాల్మియా భారత్‌ గ్రూప్‌ కంపెనీ, అధిక శాతం రిఫ్రాక్టరీలలో ఉత్పత్తిని స్థానికీకరించడంతో పాటుగా తమ ముఖ్యమైన వినియోగదారులు అయినటువంటి సెయిల్‌, టాటా స్టీల్‌, జెఎస్‌డబ్ల్యు గ్రూప్‌, జెఎస్‌పీఎల్‌ గ్రూప్‌, ఏఎంఎన్‌ఎస్‌ మొదలైన వినియోగదారులకు మద్దతునందిస్తుంది. నూతన తయారీ మార్గం ప్రారంభంతో, కంపెనీ ఇప్పుడు దిగుమతులకు ప్రత్యామ్నాయంగా స్ధానికంగా తయారుచేసిన ఎంజీఓ-సీ బ్రిక్స్‌ అందించడంతో పాటుగా 25% మార్కెట్‌ వాటాను ఒడిసిపట్టగలదని అంచనా వేస్తుంది. తరువాత కాలంలో, ఈ కంపెనీ ఈ బ్రిక్స్‌ను యూరోప్‌ మరియు ఇతర కీలక స్టీల్‌ మార్కెట్‌లకు అంతర్జాతీయంగా ఎగుమతి చేయనుంది. ఈ కంపెనీ మొత్తంమ్మీద గత రెండు సంవత్సరాలలో 50 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టింది. రాబోయే ఐదేళ్లలో మొత్త రిఫ్రాక్టరీ వ్యాపారం 50%కు పైగా వృద్ధి చెందనుందని అంచనా.
 
అంతేకాదు, దాల్మియా-ఓసీఎల్‌ ఇప్పుడు మొత్తంమ్మీద మరో 100 కోట్ల రూపాయలను రాబోయే ఐదేళ్లలో పెట్టుబడిగా పెట్టడంతో పాటుగా తమ దేశీయ తయారీ సామర్థ్యంను వేగవంతం చేయడంతో పాటుగా ఈ దశాబ్దాంతానికి 300 మిలియన్‌ టన్నుల స్టీల్‌ తయారీ దేశంగా భారతదేశాన్ని మలువాలనే లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది.
 
ఈ సందర్భంగా శ్రీ ఫగ్గన్ సింగ్ కులస్తీ, కేంద్ర ఉక్కు మంత్రిత్వశాఖ సహాయమంత్రి మాట్లాడుతూ "ప్రధానమంత్రి యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం చేరుకునేందుకు, విభిన్న రంగాలలోని పరిశ్రమలు తమ తయారీ సామర్థ్యంలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా దిగుమతులపై మనం ఆధారపడటం తగ్గుతుంది. నేడు, ఉక్కు పరిశ్రమ 1.2 మిలియన్ టన్నుల రిఫ్రాక్టరీని 142మిలియన్ టన్నులకు పైగా స్టీల్‌ను ఉత్పత్తి చేసేందుకు వినియోగిస్తుంది. దీనిలో దాదాపు 30% రిఫ్రాక్టరీలను దిగుమతి చేసుకుంటున్నారు. 
అందువల్ల, భారతదేశంలో రిఫ్రాక్టరీ ఉత్పత్తిని వృద్ధి చేయడం తప్పనిసరి.తద్వారా మనం దిగుమతులపై ఆధారపడటం తగ్గి స్వీయ సమృద్ధి సాధించగలం. 2030-31 సంవత్సరం నాటికి 300 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సాధించాలని నేషనల్ స్టీల్ పాలసీ 2017 లక్ష్యంగా చేసుకుంది. ఇది దేశీయ రిఫ్రాక్టరీలకు డిమాండ్‌ను వృద్ధి చేయనుంది. నూతన మెగ్నీషియా కార్బన్ లైన్ ఆరంభించిన దాల్మియా-ఓసీఎల్‌ను నేను అభినందిస్తున్నాను.
 
ఉక్కు పరిశ్రమ అవసరాలను తీర్చేందుకు ఈ తరహా మరిన్ని రిఫ్రాక్టరీ లైన్స్‌ను వారు ఏర్పాటుచేయడంతో పాటుగా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారం దిశగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అదే సమయంలో, మొత్తం ఉక్కు పరిశ్రమ ఏకతాటిపైకి రావడంతో పాటుగా ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం కావడానికి భారతీయ తయారీదారుల నుంచి మాత్రమే కొనుగోలు చేయడంతో పాటుగా దిగుమతులపై ఆధారపడటం తగ్గించడం ప్రారంభించాలి'' అని అన్నారు.
 
శ్రీ సమీర్‌ నాగ్‌పాల్‌, సీఈవో,దాల్మియా-ఓసీఎల్‌ మాట్లాడుతూ ‘‘ముందుగా దాల్మియా ఓసీఎల్‌ యొక్క  మెగ్నీషియా కార్బన్‌ లైన్‌ను ప్రారంభించిన  గౌరవనీయ కేంద్ర ఉక్కు మంత్రిత్వ  శాఖ సహాయ మంత్రి  శ్రీ ఫగ్గన్‌ సింగ్‌ కులస్తీకి నేను ధన్యవాదములు తెలుపుతున్నాను. గౌరవనీయ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యమైన ఆత్మనిర్భర్‌ భారత్‌ కింద భారతదేశం స్వీయ సమృద్ధి సాధించడానికి మేము కట్టుబడి ఉన్నాం. భారత్‌ కీ ఫ్యాక్టరీ మేఁ భారత్‌కీ రిఫ్రాక్టరీ అనే కీలకమైన కార్యక్రమాన్ని దాల్మియా-ఓసీఎల్‌ ప్రారంభించింది. ఆత్మనిర్భర్‌ భారత్‌కార్యక్రమం ప్రకటించిన తరువాత భారతదేశపు మొట్టమొదటి రిఫ్రాక్టరీ లైన్‌గా మెగ్నీషియా కార్బన్‌లైన్‌ నిలిచిందని వెల్లడించడానికి నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.
 
‘‘ఈ నూతన లైన్‌ కింద మేము 1,08,000 టన్నుల ఎంజీఓ-సీ బ్రిక్‌ సామర్థ్యంను ఒడిషాలోని మా రాజ్‌గంగ్‌పుర్‌ ప్లాంట్‌లో ఏర్పాటుచేయనున్నాం. ఒక్కోటి 36వేల టన్నుల సామర్థ్యంతో మూడు దశలుగా దీనిని ప్రారంభించనున్నాం. మొదటి దశను నేడు ప్రారంభించాం. చైనా నుంచి దిగుమతులను తగ్గించడంలో ఇది తోడ్పడనుంది. అంతర్జాతీయ మార్కెట్‌లలో ఒడిదుడుకుల నుంచి మన ఉక్కు తయారీదారులను కాపాడే ప్రక్రియ ప్రారంభమైందని మేము ఈ సందర్భంగా వెల్లడిస్తున్నాం. మరింత ముందుకు వెళ్తే, మేము మరింతగా మా తయారీ సామర్థ్యంను  మేక్‌ ఇన్‌ ఇండియా ఆత్మనిర్భర్‌ కోసం బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా అతి పెద్ద ఎగుమతి కేంద్రంగా నిలుపడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని శ్రీ నాగ్‌పాల్‌ జోడించారు.
 
ఉక్కు పరిశ్రమ యొక్క ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్‌కు తోడ్పాటునందిస్తూ, కత్నిలోని నూతన మోనోలిథిక్‌ లైన్‌ మరియు  రాజ్‌గంగ్‌పూర్‌లోని నోర్కల్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇప్పటికే భారతీయ పరిశ్రమలకు సహాయపడుతూ వారి ఫ్యాక్టరీల కోసం స్థానికంగా తయారుచేసిన ఉత్పత్తులు వాడుతుంది. ఈ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తమ రిఫ్రాక్టరీ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి ప్రణాళిక చేసింది, తద్వారా భారతీయ రిఫ్రాక్టరీ పరిశ్రమ భవిష్యత్‌కు ఓ ఆకృతిని అందించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవుడు దగ్గర డిక్లరేషన్ ఎందుకు? ఎత్తేస్తే సరిపోతుంది..