Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనియన్ రింగ్స్ ఎలా చేయాలంటే..?

ఆనియన్ రింగ్స్ ఎలా చేయాలంటే..?
, శనివారం, 6 అక్టోబరు 2018 (12:36 IST)
ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని పీచు పదార్థం జీర్ణవ్యవస్థను మెరుగుపరచుటకు సహాయపడుతుంది. ఈ ఉల్లిపాయలతో రకరకాల వంటకాలు తయారుచేస్తుంటారు. మరి వీటితో మరో స్నాక్స్ ఐటమ్ ఎలా చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 2
బియ్యం పిండి - 1 కప్పు
మెుక్కజొన్న పిండి - పావుకప్పు
మిరియాల పొడి - అరస్పూన్
కారం - 2 స్పూన్స్
రైస్ మిల్క్ - 1 కప్పు
నూనె - తగినంత
ఉప్పు - సరిపడా.
 
తయారి విధానం:
ముందుగా ఓవెన్‌ని 200 డిగ్రీలు హీట్ చేసి పెట్టుకోవాలి. ఆ తరువాత 2 బేకింగ్ కాగితాలను పరిచి ఉంచాలి. ఇప్పుడు గిన్నెలో బియ్యం పిండి, మెుక్కజొన్న పిండి, ఉప్పు, మిరియాల పొడి, కారం, రైస్ మిల్క్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయలను గుండ్రంగా కట్‌ చేసుకుని ఆ మిశ్రమంలో ముంచి నూనెలో వేయించుకోవాలి. తరువాత పేపర్ టవల్‌లో కాసేపు ఉంచుకుని బేకింగ్ కాగితంలో వేసుకుని ఓవెన్‌లో కాసేపు ఉంచాలి. అంతే... ఆనియన్ రింగ్స్ రెడీ. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఏం చేయాలి?