Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం: భూమికి అతిపెద్ద జలపాతం సముద్రమే కాపాడండి..

World Oceans Day
, బుధవారం, 8 జూన్ 2022 (11:49 IST)
World Oceans Day
మహా సముద్రం భూమి యొక్క ఆక్సిజన్ కనీసం 50 శాతాన్ని ఉత్పత్తి చేస్తుంది. మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డయాక్సైడ్‌ను 30శాతం శోషించుకుంటుంది. అయితే, అవి ప్రమాదంలో ఉన్నాయి. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 08న జరుపుకుంటారు.
 
1992లో బ్రెజిల్‌లోని రియో డిజనీరోలో జరిగిన ఎర్త్ సమ్మిట్‌లో కెనడాకు చెందిన ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ డెవలప్ మెంట్ అండ్ ఓషన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెనడా ఈ భావనను ప్రతిపాదించాయి.
 
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత
2030 నాటికి 40 మిలియన్ల మంది ప్రజలు సముద్ర ఆధారిత పరిశ్రమల ద్వారా ఉపాధి పొందుతారు.
సముద్రం భర్తీ చేయగలిగే దానికంటే ఎక్కువ కోల్పోతోంది. మనం ఒక సమతుల్యతను సృష్టించాలి. కొత్త జీవితాన్ని పునరుద్ధరించాలి.
 
2008లో ఐక్యరాజ్యసమితిచే అధికారికంగా గుర్తించబడిన ఈ దినోత్సవం యొక్క ఉద్దేశ్యం, సముద్రంపై ప్రభావాన్ని ప్రతి ఒక్కరికీ తెలియజేయడం, మహాసముద్రాల సుస్థిర నిర్వహణ కోసం వారిని ఏకం చేయడమే ప్రధానం.
 
కలెక్టివ్ యాక్షన్ ఫర్ ది ఓషన్ ఈజ్ వరల్డ్ ఓషన్స్ డే 2022 థీమ్
ఈ సంవత్సరాన్ని యుఎన్ డికేడ్ ఆఫ్ ఓషన్ సైన్స్ రూపొందించింది.
కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020, 2021లో రెండు సంవత్సరాల పాటు ఈ వేడుకలు రద్దయ్యాయి.
న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వార్షిక కార్యక్రమంలో ఇది మొదటి హైబ్రిడ్ వేడుక.
 
చరిత్ర
ఓషన్స్ డే యొక్క మొదటి ప్రకటన ఓషన్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెనడా నిర్వహించిన ఒక కార్యక్రమం నుండి ప్రేరణ పొందింది. గ్లోబల్ ఫోరమ్ - ది బ్లూ ప్లానెట్ వద్ద కెనడియన్ ప్రభుత్వం నుంచి మహాసముద్రాల దినోత్సవం ద్వారా మద్దతు పొందింది.
 
2008లో జూన్ 8న ఐక్యరాజ్యసమితి "ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం"గా ప్రకటించింది.
2009లో ఈ దినోత్సవాన్ని ప్రారంభి౦చడ౦లోని అ౦శ౦ ఏమిట౦టే- మన మహాసముద్రాలను కాపాడటం  మన బాధ్యత.
 
పసిఫిక్ మహాసముద్రం చంద్రుని కంటే వెడల్పుగా ఉంటుంది.
భూమి అతిపెద్ద జలపాతం సముద్రంలో ఉంది.
అతిపెద్ద సముద్ర తరంగాలు ఎక్కువగా ఉపరితలం కింద ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ విద్యార్థులకు శుభవార్త చెప్పిన అమెరికా