Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్రెజిల్‌లో ముగ్గురికి 70 రోజులుగా కోవిడ్ పాజిటివ్

బ్రెజిల్‌లో ముగ్గురికి 70 రోజులుగా కోవిడ్ పాజిటివ్
, సోమవారం, 31 జనవరి 2022 (12:39 IST)
కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో బ్రెజిల్ ఒకటి. ఇక్కడ తొలి వేవ్‌లో భారీ సంఖ్యలో కోవిడ్ పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో ఇప్పటికీ కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. 
 
అయితే, కరోనా వైరస్ సోకిన బాధితులకు ఇంక్యుబేటర్ పీరియడ్ 14 రోజులు. కానీ, అందుకు భిన్నంగా కరోనా వైరస్ ఎక్కువ రోజుల పాటు యాక్టివ్‌గా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. 
 
బ్రెజిల్‌లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురులో ఈ తరహా విలక్షణమైన కేసులు నమోదైనట్టు గుర్తించారు. ఈ ముగ్గురిలో గత 70 రోజులుగా కరోనా వైరస్ శరీరంలో ఉన్నట్టు గుర్తించారు. వీరికి ప్రతి రోజూ కరోనా టెస్టులు చేస్తూనే ఉన్నారు. 
 
ఈ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దీంతో కరోనా సోకిన కొందరు బాధితుల్లో ఈ వైరస్ ఎక్కువ రోజులు ఉంటుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ కేసులు విలక్షణమైన కేసులుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మైనర్ బాలికను వేధించిన టీడీపీ నేత ఇల్లు సీజ్