Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీదీనా మజాకా? నెక్ట్స్ ప్లాన్‌ అదేనా?

దీదీనా మజాకా? నెక్ట్స్ ప్లాన్‌ అదేనా?
, సోమవారం, 3 మే 2021 (23:00 IST)
ఒకసారి కాదు మూడుసార్లు ప్రతిసారి పెరుగుతున్న స్థానాలు. మమతా బెనర్జీ ఇక్కడితో సంతృప్తి పడతారా? మరో అడుగు ముందుకేస్తారా.. ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే కేంద్రంలో ఆల్టర్‌నేట్ ఫ్రంట్ పైన ప్రాంతీయ పార్టీ నేతలపై లేఖలు రాశారు వెస్ట్ బెంగాల్ సిఎం. ఇప్పటికిప్పుడు కాకున్నా త్వరలో జాతీయ స్థాయి రాజకీయాల్లోకి మమత అడుగుపెడతారా...?
 
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో జాతీయ రాజకీయాల్లో మార్పు వస్తుందన్న మార్పు కనిపిస్తున్నాయి పరిస్థితులు. పశ్చిమబెంగాల్‌లో బిజెపి ఆశించిన స్థాయిలో ఫర్మాన్ చేయలేకపోయింది. తమిళనాడు, కేరళలలో కూడా కమలదళానికి ఎదురుదెబ్బలే మిగిలాయి. మూడు ప్రధాన రాష్ట్రాల్లో బిజెపిని ప్రజలు ఆదరించలేదు.
 
ఈ మూడు చోట్ల ప్రాంతీయ పార్టీలు స్థానిక నాయకత్వానికి ప్రజలు అండగా నిలబడ్డారు. జాతీయ స్థాయిలో బిజెపి ఎంత బలంగా ఉందో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు అంతే బలంగా ఉన్నాయని చెబుతున్నాయి తాజా ఫలితాలు. కేంద్రంలో కాంగ్రెస్ బలహీనం కావడంతో బలమైన ప్రత్యామ్నాయం కావడానికి ఇదే మంచి తరుణమని భావిస్తున్న వారిలో దీదీ ముందున్నారు. 
 
మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలోసమాఖ్య స్ఫూర్తి దెబ్బతిందని.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఎక్కువైందన్న ఆరోపణలు పదేపదే వినిపిస్తున్నాయి. రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై కేంద్రం చట్టాలు చేయడం..పన్నుల్లో రాష్ట్రాల్లో వాటాలు ఇవ్వకపోవడంపై ప్రాంతీయ పార్టీల నేతలు ఆగ్రహంతో ఉన్నారు.
 
బిజెపి పాలిత రాష్ట్రాలకు అందుతున్న నిధులు, ప్రాజెక్టులు తమకు రావడం లేదని బిజెపియేతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్నాయి. ఈ పరిస్థితులు మారాలంటే బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఒక్క తాటిపైకి రావాలని దీదీ ఇప్పటికే విజ్ఙప్తి చేశారు. 
 
పశ్చిమబెంగాల్ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే జాతీయస్థాయి ఫ్రంట్ గురించి ప్రాంతీయ పార్టీలకు దీదీ లేఖలు కూడా రాశారు. పశ్చిమబెంగాల్‌లో మమత సాధించిన విజయం ప్రాంతీయ పార్టీల్లో ఉత్సాహం నింపింది. బిజెపి బలమైన శక్తి కాదని.. బలంగా పోరాడితే ఆ పార్టీపైన గెలవచ్చని  నిరూపించింది.
 
మమతకు ప్రాంతీయ పార్టీల నేతలంతా పోటీ  పడి శుభాకాంక్షలు తెలిపారు. తమిళనాడులో డిఎంకే ఘనవిజయం సాధించింది. కేరళలో బిజెపి ఎంత ప్రయత్నించినా చెప్పుకోదగ్గ స్థానాలు సాధించలేకపోయింది. ఈ పరిణామాలన్నీ జాతీయస్థాయిలో బలమైన ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉత్సాహాన్నిచ్చే అంశాలని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సైబర్ నేరగాళ్లకు చుక్కలు చూపించనున్న గూగుల్ ప్లే స్టోర్.. ఎలాగంటే?