Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బెంగాల్‌ దంగల్‌లో వెనుకబడిన మమతా బెనర్జీ ... తేనిలో ఓపీఎస్

Advertiesment
బెంగాల్‌ దంగల్‌లో వెనుకబడిన మమతా బెనర్జీ ... తేనిలో ఓపీఎస్
, ఆదివారం, 2 మే 2021 (09:58 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 
 
కేరళలోని పాలక్కడ్‌లో బీజేపీ అభ్యర్థి మెట్రో శ్రీధరన్ తన సమీప ప్రత్యర్థిపై 1425 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ధర్మదామ్ నుంచి పోటీలో ఉన్న ముఖ్యమంత్రి విజయన్ కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
తమిళనాడులోని కోయంబత్తూరు సౌత్ నుంచి బరిలోకి దిగిన మక్కల్ నీది మయ్యం చీఫ్, ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ తన ప్రత్యర్థిపై 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
 
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఆధిక్యంలో ఉంటే డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం వెనుకంజలో కొనసాగుతున్నారు. 
 
ఏఎంఎంకే నేత టీటీవీ దినకరన్ వెనుకంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని శివపూర్ నుంచి టీఎంసీ తరపున పోటీ చేసిన క్రికెటర్ మనోజ్ తివారీ వెనుకంజలో ఉన్నారు. ఇక, దేశ వ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ తన సమీప బీజేపీ ప్రత్యర్థి సువేందు అధికారి కంటే వెనుకంజలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా సెకండ్ వేవ్ : ఒక్క పాజిటివ్ కేసు లేని గ్రామం ఏది?