Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా బండి నడవదు.. (video)

జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా బండి నడవదు.. (video)
, మంగళవారం, 18 జూన్ 2019 (14:09 IST)
నవ్యాంధ్రకు రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేపట్టిన నేపథ్యంలో ఏపీలో తెలుగుదేశం భవిష్యత్తు గల్లంతు అయ్యిందని టాక్ వచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ జీవం పోస్తారని, ఆయన మటుకు రాజకీయాల్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటుందని వైకాపా నేత కొడాలి నాని కామెంట్స్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలకు అనంతరం ఎన్టీఆర్ కూడా స్పందించారు. ప్రస్తుతానికి సినిమాల్లో వున్నానని, రాజకీయాల్లో వచ్చే వయస్సు, పరిణతి తనకు లేదని చెప్పుకొచ్చారు. అయితే టీడీపీకి అండగా వుంటానని ప్రకటన చేశారు. దీనిని బట్టి తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు తర్వాత ఎన్టీఆర్ వెన్నంటి వున్నారని క్లారిటీ వచ్చింది. 
 
ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ నేనున్నానని భరోసా ఇవ్వడంపై సినీ రచయితగా .. నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న పోసాని కృష్ణమురళి స్పందించారు. ఇటీవలే చిన్నపాటి సర్జరీ చేయించుకున్న ఆయన, ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకి ఆయన తనదైన శైలిలో సమాధానాలిచ్చారు.
 
జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకి టీడీపీ పగ్గాలు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారంపై ఆయన స్పందిస్తూ, " జగన్మోహన్ రెడ్డిగారి పరిపాలన బాగోలేనప్పుడు .. అంతా అవినీతిమయమైపోయినప్పుడు మాత్రమే ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్‌కైనా .. జూనియర్ ఎన్టీఆర్ కైనా ఒక ప్లేస్ ఉంటుంది.. అంటూ చెప్పుకొచ్చారు. 
 
అయితే జగన్ మోహన్ రెడ్డి అలాంటి అవకాశం ఇవ్వరని.. హీరో ఇమేజ్ వేరు.. రాజకీయాలు వేరని పోసాని గుర్తు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతటి చిత్తశుద్ధితో వచ్చినా ఇక్కడ ఆయన బండి నడవదు. ఒక హీరో వచ్చి ఆకాశంలో నుంచి చుక్కలు తీసుకొస్తానంటే నమ్మే రోజులు పోయాయని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఎవరు ఏ ఉద్దేశంతో తమ మధ్యలోకి వచ్చేశారనేది జనం కనిపెట్టేశారని ఆయన తెలిపారు. 
 
అయితే పోసాని కామెంట్స్‌పై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2009లోనే రాజకీయ ప్రవేశం చేశారని.. ఆయన 25 ఏళ్లలోనే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
webdunia


జూనియర్ ఎన్టీఆర్ కచ్చితమైన విజన్‌తో వస్తారని.. ఎప్పుడు వస్తారో ఆయనకు బాగా తెలుసునని.. జూనియర్ ఎన్టీఆర్ అంటే మిగిలిన హీరోల ఫ్యాన్స్‌కు ఏమాత్రం వ్యతిరేకత లేదని.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్‌ అంటే వ్యతిరేకత తగ్గిందని.. త్వరలో ప్రజల కోసం ఆయన రాజకీయాల్లో వస్తారని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్పుకొచ్చారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏరువాక పౌర్ణమి... హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు