Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదో తరగతి బాలిక కిడ్నాప్.. అత్యాచారం.. ఎక్కడ?

victim woman
, బుధవారం, 22 నవంబరు 2023 (10:11 IST)
పదో తరగతి చదువుతున్న బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాధిత విద్యార్థి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఆలయంలో చాట్ పూజలో పాల్గొంది. ఆ తర్వాత ఆమె ఒక్కటే ఇంటికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించి కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళి అత్యాచారం చేశారు. 
 
అప్పటివరకు తమతో ఉన్న బిడ్డ కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గ్రామమంతా గాలించగా, ఆ బాలిక నిర్మానుష్య ప్రాంతంలో పడివుండటాన్ని గమనించారు. కామాంధుల అత్యాచారం కారణంగా ఆ బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బాలికను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
నేటి నుంచి తెలంగాణాలో పవన్ కళ్యాణ్ ప్రచారం.. తొలి సభ వరంగల్‌లో...  
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఇందులోభాగంగా, ఆయన బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రావు పద్మ తరపున ప్రచారం చేశారు. అలాగే, 25, 26వ తేదీల్లో జనసేన పార్టీ తరపున ఆయన ప్రచారం చేస్తారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే బహిరంగ సభల్లో కూడా ఆయన పాల్గొంటారు. 
 
ఈ నెల 30వ తేదీన జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా, తెలంగాణాలోని 119 స్థానాలకు గాను బీజేపీ - జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఇందులో బీజేపీ 111, జనసేన 9 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీతో కలిసి ఆయన పాల్గొన్నారు. 
 
ఇపుడు బీజేపీ - జనసేన పార్టీ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇందులోభాగంగా, బుధవారం వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రావు పద్మకు మద్దతుగా ప్రచారం చేస్తారు. అలాగే, ఈ నెల 25వ తేదీన తాండూరులో జనసేన అభ్యర్థి శంకర్ గౌడ్, 26న కూకట్ పల్లిలో జనసేన పార్టీ అభ్యర్థి ప్రేమ్ కుమార్‌కు మద్దతుగా ఆయన ప్రచారం చేసేలా జనసేన పార్టీ ప్రచార షెడ్యూల్‌ను ఖరారు చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.751.9 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన కాంగ్రెస్ - ఈడీ షాక్