Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థి ప్రాణం తీసిన పెన్సిల్... ఎలా?

Advertiesment
deadbody
ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకునే విద్యార్థి ప్రాణాలను ఓ పెన్సిల్ తీసింది. ఈ విషాదకర ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో బుధవారం చోటుచేసుకుంది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాయకన్ గూడెంలోని విహార్ అనే ఆరేళ్ళ బాలుడు స్థానికంగా ఉండే ఓ ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం పాఠశాల విరామ సమయంలో మూత్రశాలకు వెళ్లి తిరిగి పరుగెత్తుకుంటూ వస్తుండగా, అదుపుతప్పికింద పడిపోయాడు. 
 
ఆ సమయంలో ఆ బాలుడు చేతిలో పెన్సిల్ ఉండటంతో అది కాస్త గొంతులో గుచ్చుకుంది. దీంతో తీవ్ర రక్తస్రావం కావడంతో 108 వాహనంలో కూసుమంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ విద్యార్థి అప్పటికే మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయంగా ఎదుర్కోలేకే తప్పుడు ప్రచారం : బుట్టా రేణుక