Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమ్మాయి కోసం ముగ్గురు యువకుల గొడవ... ఆటోవాలాను రైలు కింద తోసేసి...

Advertiesment
murder

ఠాగూర్

, మంగళవారం, 9 సెప్టెంబరు 2025 (09:13 IST)
ఒక అమ్మాయి కోసం ముగ్గురు యువకులు గొడవపడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు యువకులు మరో యువకుడుని వేగంగా వస్తున్న రైలు కింద తోసి చంపేసి, అక్కడ నుంచి పారిపోయారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని బెంగుళూరు నగరంలో చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరు విజయపురకు చెందిన ఇస్మాయిల్ (20) అనే యువకుడు ఆటో డ్రైవరుగా పని చేస్తున్నాడు. ఆ యువకుడితో ఇద్దరు వ్యక్తులు గొడవపడ్డారు. బెళ్లందూరు - బయ్యప్పనహళ్లి మధ్య రైలు వస్తున్న సమయంలో పట్టాలపైకి ఆ యువకుడిని తోసేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు యువకులు అక్కడ నుంచి పారిపోయారు. 
 
ఓ యువతి విషయంలో ఈ ముగ్గురు గొడవపడ్డారు. ఈ గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఇస్మాయిల్‌ను ఆ ఇద్దరూ బలంగా పట్టాలపైకి తోసేయడంతో మృతదేహం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైపోయింది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వంసిద్ధం - పోటీలో ఉన్నది ఎవరో తెలుసా?