Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మోసం చేసిన ప్రియుడిపై కత్తి - యాసిడ్‌తో యువతిదాడి!

Advertiesment
knife

ఠాగూర్

, సోమవారం, 12 ఆగస్టు 2024 (08:59 IST)
ఏపీలోని అన్నమయ్య జిల్లా నందలూరులో ఓ యువతి తనను ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రియుడిపై కత్తి, యాసిడ్‌తో దాడిచేసింది. కళ్యాణమండపానికి నేరుగా వచ్చిన ఆ యువతి ఈ దాడికి తెగబడింది. మరికొన్ని క్షణాల్లో పెళ్లిపీటలెక్కాల్సిన పెళ్ళి కుమారుడు తనను మోసం చేశాడని చెబుతూ ఓ యువతి అక్కడకు వచ్చి కత్తి, యాసిడ్‌తో వీరంగం చేసింది. ఈ హఠాత్పరిణామానికి అక్కడ ఉన్నవారంతా హతాశులయ్యారు. 
 
అన్నమయ్య జిల్లా నందలూరులో ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం.. రైల్వేకోడూరుకు చెందిన సయ్యద్‌ బాషా, తిరుపతికి చెందిన జయ అనే మహిళ పదేళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. కొంత కాలం కిందట స్వగ్రామానికి వచ్చేసి ఓ యువతితో పెళ్లి సంబంధం కుదుర్చుకున్నాడు. ఆదివారం వారి వివాహం జరుగుతోందని తెలుసుకున్న జయ.. కార్యక్రమానికి వచ్చి ప్రియుణ్ని నిలదీసింది. 
 
ఆ తర్వాత ఆగ్రహంతో ఊగిపోతూ తనతో తెచ్చుకున్న కత్తి, యాసిడ్‌తో అతనిపై దాడి చేసేందుకు యత్నించింది. ఈ క్రమంలో కరీష్మా అనే మహిళపై యాసిడ్‌ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహించిన బాషా.. కత్తితో జయపై దాడి చేయడంతో ఆమె కూడా తీవ్రంగా గాయపడ్డారు. వధువు తరపు బంధువులు పెళ్లిని నిలిపివేసి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్‌ జహీర్‌ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మద్యం మత్తులో 100 కిమీ వేగంతో కారు డ్రైవింగ్.. వ్యక్తి మృతి (Video)