Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మద్యం మత్తులో 100 కిమీ వేగంతో కారు డ్రైవింగ్.. వ్యక్తి మృతి (Video)

road accident

ఠాగూర్

, సోమవారం, 12 ఆగస్టు 2024 (08:41 IST)
హైదరాబాద్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొందరు యువకులు పీకల వరకు మద్యం సేవించి కారును వంద కిలోమీటర్ల వేగంతో నడిపి ఓ వ్యక్తి మృతికి కారణమయ్యారు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ నగరంలోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. పాటిగడ్డకు చెందిన భాషా గోపి(38)గాజులరామారంలో ఉంటూ కూలీ పనులు చేస్తుంటాడు. అతని తల్లికి జ్వరం రావడంతో ఆదివారం టిఫిన్‌ కోసం బయటకు వచ్చాడు. 
 
దేవేందర్ నగర్ రోడ్డుపై  నడిచి వెళుతుండగా మలుపు వద్ద సుమారు 100 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. గోపి 15 అడుగుల దూరంలోని ప్రహరీ లోపల ఎగిరి పడి చనిపోయాడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన మనీష్‌గౌడ్‌(20) కారు నడిపాడు. అతనికి పరీక్షలు చేయగా 200 పాయింట్లు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గోపికి వచ్చే ఆదివారం పెళ్లి చూపులని బంధువులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 
 
రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు... రన్నింగ్‌లో ఉండగా దూకేసిన ప్రయాణికులు! 
 
రైలులో అగ్నిప్రమాదమంటూ పుకార్లు వచ్చాయి. దీంతో రైలు రన్నింగ్‌లో ఉండగానే అనేక మందిం ప్రయాణికులు కిందకు దూకేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిల్‌పూర్ సమీపంలో చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం చోటుచేసుకుందన్న పుకార్లతో భయాందోళనలకు గురైన కొంతమంది ప్రయాణికులు కదులుతున్న రైల్లోంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. 
 
రైల్వే పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. హౌరా - అమృత్‌సర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు బరేలీలోని బిల్‌పుర్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో.. ఓ జనరల్‌ బోగీలో మంటలు చెలరేగినట్లు వదంతులు వ్యాప్తించాయి. దీంతో గుర్తుతెలియని వ్యక్తులు ఎమర్జెన్సీ చైను లాగారు. అంతలోనే అగ్నిప్రమాదం భయంతో పలువురు ప్రయాణికులు కదులుతున్న రైలులోనుంచి కిందికి దూకేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.
 
రైలులో కొంతమంది ఆకతాయిలు అగ్నిమాపక పరికరాన్ని వినియోగించారని.. దీంతో మంటలు చెలరేగినట్లు భావించిన ప్రయాణికులు కిందికి దూకేశారని తొలుత అధికారులు పేర్కొన్నారు. 12 మందికి గాయాలైనట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.


 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖ విద్యార్థినికి అరుదైన గౌరవం.. ఢిల్లీ స్వాతంత్ర్య వేడుకలకు ఆహ్వానం