Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రేమ పేరుతో ప్రియుడు.. వీడియోలు చూపి బెదిరించి మరొకరు... బీటెక్ విద్యార్థినిపై అత్యాచారం.. ఎక్కడ?

Advertiesment
rape
, శనివారం, 4 నవంబరు 2023 (10:27 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో విద్యార్థిని అత్యాచారానికి గురైంది. బాధితురాలు బీటెక్ విద్యార్థిని కావడం గమనార్హం. ప్రేమ పేరుతో ఒకరు అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అత్యాచార వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించి మరో కామాంధుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం అనంతపురం జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి చెందిన ఓ విద్యార్థిని విజయవాడలో బీటెక్ చేస్తుంది. ఆమెకు అదే మండలానికి చెందిన కృష్ణారెడ్డి అనే యువకుడితో ఐదు నెలలుగా పరిచయం ఉంది. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటపడసాగాడు. ఆమెను నమ్మించడానికి చేయిని బ్లేడుతో సైతం కోసుకున్నాడు. దీంతో కృష్ణారెడ్డిని గుడ్డిగా నమ్మేసింది. అప్పటి నుంచి అతనితో చనువుగా ఉండటం ప్రారంభించింది. 
 
ఈ నేపథ్యంలో అక్టోబరు 19వ తేదీన కృష్ణారెడ్డి విజయవాడలో హాస్టల్లో ఉన్న యువతికి ఫోన్ చేసి బెంగళూరుకు రావాలని, లేని పక్షంలో ఇద్దరి పరిచయాన్ని కుటుంబసభ్యులకు, తెలిసినవారికి చెబుతానని బెదిరించాడు. దీంతో 20న బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఆమెను నిందితుడు తన మిత్రుడి గదికి తీసుకెళ్లాడు. గదిలో ఎవరూ లేనప్పుడు బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా నాలుగు రోజుల పాటు అక్కడే లైంగిక దాడి చేశాడు.
 
అతని బారి నుంచి తప్పించుకున్న బాధితురాలు... సొంతూరుకు చేరుకుంది. తిరిగి అక్టోబరు 28న కళాశాలకు వెళ్లడానికి తండ్రితో కలిసి గుత్తి వరకు వెళ్లింది. ఆమెను అక్కడ వదిలి వెనుదిరిగాడు. ఆ సమయంలో యువతి ఫోనుకు గుంతకల్లు పట్టణానికి చెందిన దివాకర్ అనే వ్యక్తి ఫోన్ చేసి 'బెంగళూరులో కృష్ణారెడ్డితో ఏకాంతంగా కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు నా వద్ద ఉన్నాయి.. నేను చెప్పినట్లు వినకపోతే సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తా'నని బెదిరించి గుంతకల్లుకు రావాలన్నాడు.
 
దీంతో భయపడిన బాధితురాలు గుంతకల్లుకు వెళ్లగా.. ఆమెను స్థానికంగా ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. పలుమార్లు బెదిరింపులకు పాల్పడుతూ రెండు రోజుల పాటు లైంగికంగా నరకం చూపించాడు. ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు రహస్యంగా చిత్రీకరించాడు. వాటిని మొదటి నిందితుడు కృష్ణారెడ్డి, మరికొందరికి పంపాడు. 
 
ఇలా కృష్ణారెడ్డి, దివాకర్ వాళ్లకు తెలిసిన మిత్రులు అందరికీ పంపించారు. ఇది తెలియని బాధితురాలు లాడ్జి నుంచి బయటపడి విజయవాడకు వెళ్లిపోయింది. ఆ ఫొటోలు, వీడియోలు అదే మండలానికి చెందిన సుదర్శన్ రెడ్డికి చేరడంతో.. అతడు ఆ అమ్మాయి సమీప బంధువులకు తెలిపాడు. దీంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఆమెతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉద్యోగులకు దీపావళి బోనస్‌గా కార్లు బహుమతిగా ఇచ్చిన కంపెనీ యజమాని.. ఎక్కడ?