Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చికెన్ తీసుకెళుతూ ఆ షాపు యువకుడితో ప్రేమ, పెళ్లి మాటెత్తితే...

Advertiesment
చికెన్ తీసుకెళుతూ ఆ షాపు యువకుడితో ప్రేమ, పెళ్లి మాటెత్తితే...
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (17:32 IST)
అబ్బాయి బాగున్నాడు. నన్ను అర్థం చేసుకుంటున్నాడు.. ఉద్యోగం వచ్చిందే పెళ్ళి చేసుకుంటాడు. కంటికి రెప్పలా కాపాడుకుంటానని నమ్మింది. అతనికి సర్వస్వం అర్పించింది. అందాన్ని పొగుడుతూనే లోబరుచుకున్న ఆ యువకుడు చివరకు ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసేస్తాడని ఊహించలేకపోయింది. న్యాయం కోసం పోలీసుల చుట్టూ తిరుగుతోంది.

 
కడప జిల్లా రాయచోటికి చెందిన మంజుల అనే యువతి స్థానికంగా చికెన్ షాపు ఓనర్ రాముకు కనెక్టయ్యింది. రాము అందంగా ఉంటాడు. ఎలాంటి అలవాట్లు లేవు. తండ్రి పెట్టించిన చికెన్ షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎం.బి.ఎ. పూర్తి చేసి ఉద్యోగం కోసం కూడా వెతుకున్నాడు.

 
అయితే చికెన్ కోసం వచ్చే మంజుల అతనికి దగ్గరమైంది. పరిచయం కాస్త ప్రేమ, ఆ తరువాత శారీరకంగా కలవడం జరిగిపోయాయి. మంజుల గర్భిణి అయ్యింది. తనను పెళ్ళి చేసుకోవాలని రామును కోరింది. ఉద్యోగం వచ్చిన తరువాతే అంటూ చెప్పడం మొదలెట్టాడు. 

 
శారీరకంగా కలిసిన వీడియోలు ఉన్నాయంటూ వాటిని చూపించి ఇంకోసారి పెళ్ళి అంటే ఒప్పుకునేది లేదంటూ బెదిరించడం మొదలెట్టాడు. దీంతో అసలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది యువతి. పోలీసుల సహాయంతో ఇద్దరికి ఎలాగోలా పెళ్ళి చేశారు. 

 
అయితే పెళ్ళి చేసుకున్నాడే కానీ మంజులను హింసించడం మొదలెట్టాడు. అతి దారుణంగా శరీర భాగాలపై కొట్టేవాడు. దీంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది మంజుల. చెల్లెలి సహాయంతో కడప ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ