Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ

కొత్త జిల్లా కోసం బాలకృష్ణ హిందూపురంలో ర్యాలీ
, గురువారం, 3 ఫిబ్రవరి 2022 (20:05 IST)
సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహిరంచనున్నారు. ఆయన టీడీపీ కార్యకర్తలు, హిందూపురం ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని నిర్వహించనున్నారు. 
 
శుక్రవారం ఉదయం హిందూపురంలో ఆయన ర్యాలీ నిర్వహించనున్నారు. పట్టణంలోని శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ జరుగనుంది. ర్యాలీ అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బాలకృష్ణ మౌనదీక్షకు దిగుతారు. ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణపై ఆయన ఉద్యమ నేతలతో చర్చిస్తారు. ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుష్పరాజ్ సినిమాపై గరికపాటి ఫైర్.. ఆ మాటలు ఇట్టే నిజమైనాయిగా?