Publish Date: Thu, 03 Feb 2022 (13:05 IST)
Updated Date: Thu, 03 Feb 2022 (13:07 IST)
శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఓం నమో నారాయణాయ… అష్టాక్షరీ మంత్రంతో అణువణువూ ప్రతిధ్వనిస్తోంది. 2022, ఫిబ్రవరి 03వ తేదీ ప్రారంభమైన ఈ ఉత్సవాలు., ఫిబ్రవరి 14వ తేదిన.. మహా పూర్ణాహుతితో ముగుస్తుది.
దేశం నలుమూలల నుంచీ తరలివచ్చిన 5వేలమంది రుత్విజులు ఆధ్వర్యంలో శ్రీలక్ష్మీనారాయణ మహాక్రతువుతో ముచ్చింతల్ ప్రాంగణం వైభవంగా కనిపిస్తోంది. 108 దివ్యదేశాల ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన తర్వాత.. ఈ యాగశాలలో వినియోగించిన కలశాల్లోనీ జలాలన్నీ తీసుకెళ్లి.. 108 ఆలయాల పైనున్న శిఖరాలపైన ప్రోక్షణ చేస్తారు.
సహస్ర కుండాత్మక మహా విష్ణు యాగం ముగిశాక మరో అద్భుతమైన కార్యక్రమం నిర్వహించనున్నారు త్రిదండి చిన్నజీయర్ స్వామి. శాంతి కల్యాణం పేరుతో జరగబోయే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం భగవద్రామానుజుల వెయ్యేళ్ల పండుగలో మరో కీలక ఘట్టం.
108 దివ్య తిరుపతుల ఉత్సవ మూర్తులకు.. ఏకకాలంలో కల్యాణం జరపనున్నారు. ఇలాంటి కార్యక్రమం.. ఇంతకు ముందెప్పుడూ.. ఎక్కడా జరగలేదు. ఇది.. శ్రీరామనగరంలోనే తొలిసారి నిర్వహించనున్నారు.