Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అబ్రార్ ఏడు వికెట్లు.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు (video)

Advertiesment
Abrar Ahmed
, శనివారం, 10 డిశెంబరు 2022 (11:37 IST)
Abrar Ahmed
పాకిస్థాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. వరుసగా ఏడు వికెట్లు పడగొట్టి క్రీడాభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా ఈ మేరకు ఈ యువ లెగ్ స్పిన్నర్ ఈ ఘనతను సృష్టించాడు. 
 
ఇంగ్లండ్‌లో జరిగిన రెండో టెస్టులో భాగంగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే దెబ్బకొట్టాడు అబ్రార్. ఓపెనర్ జాక్ క్రాలేను 19 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. అయితే బెన్ డకెట్ (63), ఓలీ పోప్ (60) పరుగులకే పెవిలియన్ చేర్చగలిగాడు. 
 
ఆ తర్వాత జో రూట్ (80), హ్యారీ బ్రూక్ (9), కెప్టెన్ బెన్ స్టోక్స్ (30) వికెట్లను కైవసం చేసుకున్నాడు. చివరిగా విల్ జాక్స్ వికెట్‌తో అబ్రార్ ఖాతాలో వరుసగా ఏడు వికెట్లు సాధించిన ఘనత చేరింది.  అబ్రార్‌ ఏడు వికెట్లు కూల్చగా.. అందులో మూడు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి.
 
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో.. 24 ఏళ్ల అబ్రార్‌ అహ్మద్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా అబ్రార్‌ (144/7) అదిరిపోయే బౌలింగ్‌తో మెరవగా, జాహిద్‌ మహ్మద్‌ 3 వికెట్లు కూల్చాడు. దీంతో.. 51.4 ఓవర్లలో 281 పరుగుల వద్ద ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్.. షెడ్యూల్ ప్రకటన