Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాడు విలన్... నేడు హీరో.. ఎవరా క్రికెటర్?

ben stokes
, సోమవారం, 14 నవంబరు 2022 (10:33 IST)
ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టు నిర్ధేశించిన 138/8 విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఐదు వికెట్లను కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ విజయంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. 
 
ఒక దేశంలో 45 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ జట్టను బెన్ స్టోక్స్ ఆదుకున్నాడు. ఒక్కో పరుగు చేరుస్తూ, వీలు చిక్కినపుడు ఫోర్లు, సిక్స్‌లు బాదుతూ జట్టు స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాడు. ఫలితంగా ఇంగ్లండ్ విజయభేరీ మోగించి, రెండోసారి పొట్టి క్రికెట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. 
 
ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోక్స్.. ఒకపుడు విలన్‌ కాగా, ఇపుడు హీరోగా నిలిచాడు. 2016 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. విండీస్ లక్ష్య ఛేదనలో స్టోక్స్ చివరి ఓవర్ వేయగా, ఆ ఓవర్‌లో విండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్ వైట్ సిక్సర్ల వర్షం కురిపించాడు.
 
చివరి ఓవర్‌లో 18 పరుగులు కావాల్సిన తరుణంలో స్టోక్స్ వేసిన బంతులను గ్యాలెరీ స్టాండ్స్‌కు పంపి, విండీసి జట్టును విజేతగా నిలిచాడు. ఫలితంగా ఇంగ్లండ్‌కు దిగ్భ్రాంతికర ఓటమి ఎదురైంది. ఆ సమయంలో స్టేడియంలోనే స్టోక్స్ కన్నీటి పర్యంతమయ్యాడు. తన కారణంగా కప్ చేజారిందన్న బాధతో ఆయన కుంగిపోయాడు. 
 
ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఈ ట్వంటీ20 ప్రపంచ కప్‌లో ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపాడు. పాకిస్థాన్‌తోజరిగిన ఫైనల్‌లో స్టోక్స్ జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. 49 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్స్ సాంతో 52 పరుగులు చేసి అజేయంగా నిలవడమే కాకుండా జట్టును విశ్వవిజేతగా నిలిపాడు. దీంతో ఇపుడు ఇంగ్లండ్‌లో హీరోగా నిలిచాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐసీసీ ట్వంటీ20 ప్రపంచ కప్ విజేతగా ఇంగ్లండ్ - పాక్‌కు 'స్టోక్' షాక్