Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాకిస్థాన్‌ జట్టుకు అదనపు ఫీల్డర్‌గా సచిన్ టెండూల్కర్?

పాకిస్థాన్‌ జట్టుకు అదనపు ఫీల్డర్‌గా సచిన్ టెండూల్కర్?
, సోమవారం, 31 మే 2021 (11:49 IST)
మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్.. పాకిస్థాన్‌ జట్టుకు అదనపు ఫీల్డర్‌గా వ్యవహరించాడంటే నమ్ముతారా.. నమ్మి తీరాల్సిందే. ఈ విషయాన్ని 48 ఏళ్ళ సచిన్ తన జీవిత చరిత్ర ‘ప్లేయింగ్ ఇట్ మై వే’ పుస్తకంలో ప్రస్తావించారు. 
 
సచిన్ 1989లో పాకిస్తాన్ పర్యటన సందర్భంగా కరాచీ టెస్ట్‌లో సచిన్ తన తొలి టెస్ట్ ను ఆడాడు. జట్టు ఇండియాలో అయితే దానికి రెండేళ్ల ముందు పాకిస్తాన్ జట్టు ఇండియాలో పర్యటించినపుడు ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ కొంత సేపు పాకిస్తాన్ జట్టుకు అదనపు ఫీల్డర్‌గా వ్యవహరించాడు. 
 
ఆ సంఘటనను సచిన్ వివరిస్తూ లంచ్ తర్వాత పాక్ ఆటగాళ్లు మియాందాద్ , అబ్దుల్ ఖాదిర్‌లు ఆలస్యం చేయటంతో పాక్ కెప్టెన్ సచిన్‌ను కొద్దిసేపు ఫీల్డింగ్ చేయాలసిందిగా కోరాడు. దీంతో ఆశ్చర్య పోయిన సచిన్ ఫీల్డింగ్‌కు దిగాడు. ఒక దశలో కపిల్ దేవ్ క్యాచ్‌ను అందుకున్నంత పని చేశాడు. లాంగ్ ఆన్‌లో ఉన్న సచిన్ చాల దూరం పెరిగేట్టు కుంటూ వచ్చి క్యాచ్ మిస్ చేసాడు. 
 
ఈ విషయాన్నీ సచిన్ గుర్తు చేసుకుంటూ నాటి సంఘటన ఇమ్రాన్ ఖాన్‌కు గురుతుందో లేదో ? అని తన బయోగ్రఫీలో పేర్కొన్నాడు. అలా సచిన్ తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ను పాకిస్తాన్‌కు ఆడాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

IPL 2021 UAE: ఆసీస్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు దూరం.. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు..!