భారత స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ 2026 టీ20 ప్రపంచ కప్‌కు ఐసీసీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా ఎక్స్ ద్వారా ప్రకటించారు. మరోవైపు ఐసీసీ పురుషుల టీ-20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్‌ను అధికారికంగా విడుదల చేశారు.
ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్ శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జరగనుంది. మొత్తం 20 జట్లు పాల్గొంటాయి. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, ఈ టోర్నీని స్వదేశంలో ఆడనుంది.
ముంబైలో జరిగిన షెడ్యూల్ ప్రకటన కార్యక్రమంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఈ టోర్నీకి అంబాసిడర్‌గా నియామకం చేశారు. ఈ కార్యక్రమంలో జయ్ షా, క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు. ఈ టోర్నీలోని అతి ముఖ్యమైన మ్యాచ్ అయిన భారత్-పాకిస్తాన్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది.