టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భావోద్వేగానికి లోనయ్యాడు. భారత మహిళా జట్టు తమ తొలి ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డాక్టర్ డి.వై. పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ను చూడటానికి భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా వచ్చారు. భారత విజయం తర్వాత, స్టేడియం అంతటా సంబరాల వాతావరణం నెలకొంది. విజయం తర్వాత, కెమెరాలు స్టాండ్స్‌లో కూర్చున్న రోహిత్ శర్మపై దృష్టి సారించాయి. మైదానంలో మహిళా జట్టు సభ్యులు విజయోత్సవంలో మునిగిపోయి వుండగా కెమెరాలు రోహిత్ ముఖంపై జూమ్ చేశాయి. స్టేడియంలోని బాణసంచా పేలుళ్ల మధ్య, మాజీ భారత కెప్టెన్ ఒకింత భావోద్వేగానికి లోనైనట్లు కనిపించింది. స్టేడియంలో అభిమానుల్లో చాలామంది ఉద్వేగానికి లోనైనట్లు కెమేరాల్లో కనబడుతున్నాయి.
 
									
			
			 
 			
 
 			
					
			        							
								
																	
	 
	తొలి ప్రపంచకప్ ఇలా సాధించేసారు
 
									
										
								
																	
	మహిళా ప్రపంచ కప్ పోటీల్లో ఇవాళ భారతీయ అమ్మాయిలు అదరగొట్టేసారు. అన్ని విభాగాల్లో రాణించడంతో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. ముఖ్యంగా ఇండియన్ బౌలర్ షఫాలీ వర్మ మ్యాచ్ మలుపు తిప్పింది. 21వ ఓవర్లో కీలకమైన దక్షిణాఫ్రికా బ్యాట్స్ ఉమెన్ సూనె లుస్(25 పరుగులు) కీలకమైన వికెట్ పడగొట్టడంతో దక్షిణాఫ్రికా జట్టుపై ఒత్తిడి పెరిగింది.
 
									
											
							                     
							
							
			        							
								
																	
	 
	ధాటిగా ఆడుతున్న సూనె లుస్ కాట్ అండ్ బౌల్డ్ చేయడంతో సూనే షాక్ తిన్నది. ఆ తర్వాత మళ్లీ 23వ ఓవర్లో మరిజాన్నే కాప్ ను కేవలం 4 పరుగులకే కట్టడి చేసింది. దాంతో దక్షిణాఫ్రికా జట్టు స్కోరు కార్డ్ మందగించింది. ఇంకోవైపు దక్షిణాఫ్రికా జట్టుకి దీప్తి శర్మ రూపంలో ప్రమాదం ఎదురైంది. ఆమె కీలకమైన 5 వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా నడ్డి విరిగింది. దాంతో దక్షిణాఫ్రికా 52 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మహిళా ప్రపంచ కప్ పోటీల్లో ఇప్పటివరకూ ప్రపంచ కప్ అందుకోని భారత మహిళా జట్టు తొలిసారిగా విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 2017లో చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోయింది. ఆనాడు కేవలం స్వల్పంగా 7 పరుగుల తేడాతో కప్ చేజారింది. ఇక ఇప్పుడు మన అమ్మాయిలు ప్రపంచ కప్ గెలిచి సత్తా చాటారు.
 
									
			                     
							
							
			        							
								
																	
	 
	టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. దాంతో బరిలోకి దిగిన ఇండియన్ ఉమెన్ బ్యాట్సమన్లు నిర్దేశిత 50 ఓవర్లకు 298 పరుగులు చేసారు. స్మృతి మంధన 45 పరుగులు చేసారు. షఫాలి వర్మ కేవలం 78 బంతుల్లో 87 పరుగులు చేసారు. ఆమె 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో ఈ పరుగులు రాబట్టారు. సెమీఫైనల్లో మెరుపులు మెరిపించిన జెమియా ఫైనల్ మ్యాచిలో 24 పరుగులకే ఔటయ్యింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 20 పరుగులు, దీప్తి శర్మ 58 పరుగులు చేసి నాటవుట్ గా నిలిచింది. అమన్ జోత్ కౌర్ 12 పరుగులు, రిచా ఘోష్ 34 పరుగులు, రాధా యాదవ్ 3 పరుగులు చేసారు.