భారత గ్రేట్ ఆల్‌రౌండర్... 300 వికెట్ల క్లబ్‌లో అశ్విన్
భారత క్రికెట్ జట్టుకు దొరికిన గ్రేట్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతగాడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. అదీకూడా
భారత క్రికెట్ జట్టుకు దొరికిన గ్రేట్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. ఇతగాడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 300 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా తన పేరును లిఖించుకున్నాడు. అదీకూడా అత్యంతవేగంగా ఈ వికెట్లను తీశాడు. ఫలితంగా అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
నాగ్‌పూర్ వేదికగా ప్రత్యర్థి శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. పనిలోపనిగా స్పిన్నర్ అశ్విన్ అరుదైన ఘనతలు సొంతం చేసుకున్నాడు. అత్యంత వేగంగా 300 వికెట్లు సాధించిన బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. కేవలం 54 టెస్టుల్లోనే ఈ ఘనత సాధించిన బౌలర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు ఈ యేడాది టెస్టుల్లో 50 వికెట్లు తీసుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. పెరీరా వికెట్ తీయడంతో అశ్విన్ ఈ ఫీట్‌ను సాధించాడు. కేలండర్ ఇయర్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న వారిలో ఫస్ట్ ప్లేస్‌లో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లయన్ ఉన్నాడు.
ఇకపోతే.. ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో 54 టెస్టుల్లోనే.. 300 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు అశ్విన్ సొంతమైంది. అంతకుముందు ఈ ఘనత ఆస్ట్రేలియాకు చెందిన డీకే లిల్లీ పేరిట ఉంది. లిల్లీ 56 టెస్టుల్లో 300 వికెట్లు తీస్తే.. శ్రీలంక బౌలర్ మురళీధరన్ 58 టెస్టుల్లో ఈ ఘనత సాధించాడు. 54 టెస్టుల్లో 101 ఇన్నింగ్స్‌లో అశ్విన్ 300 వికెట్లు తీశాడు. వీటిలో 26 సార్లు 5 వికెట్లు తీసుకోగా.. 7 సార్లు 10 వికెట్లు తీసుకున్న ఘనత కూడా అశ్విన్ సొంతం అయ్యింది.