టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడింది. ఈమె పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్మృతి మంధన కాబోయే భర్త.. మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ రాసలీలల కారణంగానే స్మృతి మంధన పెళ్లి ఆగిపోయిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.
ఈ మేరకు పలాష్ మరో మహిళతో జరిపిన సీక్రెట్ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సీక్రెట్ చాట్‌లో స్మృతి మంధానతో తన సంబంధం లాంగ్ డిస్టెన్స్ లవ్ అని, అంతేకాకుండా తాను చాట్ జరుపుతున్న సదరు యువతి అందాన్ని వర్ణించాడు. దీంతో స్మృతితో పాటు ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల పెళ్లి నవంబర్ 23న సాంగ్లీలో జరగాల్సింది. కానీ స్మృతి తండ్రితో పాటు ముచ్చల్ కూడా అస్వస్థతకు గురికావడం వల్ల పెళ్లి వాయిదా పడిందని టాక్ వస్తోంది.
అయితే ఈ వార్తల్లో నిజం లేదని.. పలాష్ అఫైర్స్ వల్లే పెళ్లిపై ఇంకా క్లారిటీ రాలేదని సమాచారం. సరిగ్గా పెళ్లికి ముందే పలాష్ బాగోతం స్మృతి మంధాన ఫ్యామిలీకి తెలిసిందని, ఇది తట్టుకోలేకనే ఆమె తండ్రి అస్వస్థతకు గురయ్యారనే ప్రచారం జరుగుతుంది. అయితే ఈ ప్రచారంలో ఎంత మేర వాస్తవం ఉందనేది తెలియదు.