Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Smriti Mandhana: పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనున్న స్మృతి మంధాన.. ఎంగెజ్మెంట్ ఓవర్

Advertiesment
Smriti Mandhana

సెల్వి

, గురువారం, 20 నవంబరు 2025 (21:51 IST)
Smriti Mandhana
భారత క్రికెటర్ స్మృతి మంధాన సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్‌ను వివాహం చేసుకోనుంది. ఇండోర్‌లోని పలాష్ ముచ్చల్ ఇల్లు రంగుల లైట్లతో అందంగా అలకరించబడింది. సంగీతం, క్రికెట్ ప్రపంచానికి చెందిన స్మృతి, పలాష్ ఒకటి కానున్న వేళ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. 
 
ఐసిసి మహిళల ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన తర్వాత, టీమ్ ఇండియా స్మృతి పెళ్లికి సిద్ధమవుతోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి క్రీడాకారిణులు స్మృతి వివాహానికి హాజరు కానున్నారు. 
 
ఈ జంట 2019లో ప్రేమలో పడింది. జూలై 2024లో తమ సంబంధాన్ని ఇన్‌స్టాగ్రామ్ అధికారికంగా ధృవీకరించింది. . అక్టోబర్ 2025లో, ముచ్చల్ ఇండోర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో స్మృతిపై ప్రేమను వ్యక్తపరిచాడు. 
 
ఇటీవల టీమిండియా ప్రపంచ కప్ గెలిచిన చిత్రాలను పోస్ట్ చేశారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. అంతేగాకుండా టీం ఇండియా మహిళా స్టార్ బ్యాట్స్‌మన్ స్మృతి మంధాన తన నిశ్చితార్థాన్ని అధికారికంగా వెల్లడించింది. దీనికోసం ఆమె ఒక ప్రత్యేకమైన మార్గాన్ని ఎంచుకుంది. తనతో పాటు తన టీం ఇండియా ఆటగాళ్లతో ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ చేసి తన ఎంగేజ్‌మెంట్‌ను అందిరితో పంచుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టీ-10 లీగ్‌.. పాకిస్థాన్‌ను బౌలర్‌తో కరచాలనం చేసిన హర్భజన్ సింగ్