మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే క్రికెట్ సిరీస్ గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన పర్యాటక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 33.3 ఓవర్లు ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఇంగ్లీష్ ఆటగాళ్లలో సాల్ట్ 43, డక్కెట్ 32, రూట్ 19, బ్రూక్ 0, బట్లర్ 52 చొప్పున పరుగులు చేయగా, బెథెల్ 24, లివింగ్‌స్టోన్ 2 చొప్పున పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. మోకాలి నొప్పితో బాధపడుతుండటంతో కోహ్లీ దూరంగా ఉన్నట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. అలాగే, ఈ మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ముఖాలకు చోటు కల్పించినట్టు చెప్పాడు. వారిలో యశస్వి జైస్వాల్, హర్షిత్ రాణాలు ఉన్నారని చెప్పాడు. పేస్ బౌలింగ్ కోసం షమీ, రాణా, పాండ్యాలు, స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ యావద్, అక్షర పటేల్‌లను తీసుకున్నట్టు రోహిత్ వివరించాడు.