Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ : టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్

border gavaskar trophy

ఠాగూర్

, శుక్రవారం, 22 నవంబరు 2024 (08:23 IST)
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా, శుక్రవారం భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్‌కు బరిలోకి దిగిన భారత జట్టులో ఇద్దరు కుర్రోళ్లు టెస్ట్ అరంగేట్రం చేశారు. వీరిలో ఒకరు తెలుగు యువ క్రికెటర్ ఉన్నారు. అతని పేరు నితీశ్ కుమార్ రెడ్డితో పాటు.. మరో కుర్రోడు హర్షిత్ రాణాకు ఆ భాగ్యం దక్కింది. అరంగేట్ర ఆటగాళ్లకు దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ చెరొకరికి టీమిండియా క్యాప్స్ అందజేసి అభినందనలు తెలిపారు. ఈ మ్యాచ్‌లో సీనియర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్లకు చోటు దక్కలేదు.
 
టాస్ గెలిచిన తర్వాత భారత కెప్టెన్ బుమ్రా స్పందిస్తూ, మంచి పిచ్ కనిపిస్తుండడంతో బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. తమ ప్రాక్టీస్‌పై పూర్తి నమ్మకం ఉందని, 2018లో ఇక్కడ ఒక టెస్ట్ మ్యాచ్ ఆడామని, కాబట్టి ఈ పిచ్‌పై ఏం ఆశించాలో తెలుసునని చెప్పాడు. నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా అరంగేట్రం చేస్తున్నాడని ప్రకటించాడు. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌ను జట్టులోకి తీసుకున్నామని వివరించాడు.
 
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ స్పందిస్తూ, ఫార్మాట్ ఏదైనా భారత్ - ఆస్ట్రేలియా జట్లు పోటాపోటీగా తలపడతాయని అన్నాడు. నాథన్ మెక్వ్‌వినీ అరంగేట్రం చేస్తున్నాడని, ఓపెనర్ బ్యాటింగ్ చేస్తాడని తెలిపాడు.
 
తుది జట్లు ఇవే..
భారత్ : కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్, నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, జస్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్.
 
ఆస్ట్రేలియా : ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్‌‍వినీ, మార్నస్ లాబూషేన్, స్టీవెన్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, నాథన్ లియోన్, జాస్ హేజిల్ వుడ్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేవిడ్ కప్ క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ ఓటమి.. టెన్నిస్‌కు నాదల్ గుడ్ బై