Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్: భారతదేశ స్వాతంత్ర్య ప్రయాణం పునశ్చరణ

image

ఐవీఆర్

, సోమవారం, 18 నవంబరు 2024 (17:38 IST)
భారతదేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన బహుముఖ పోరాటంలోకి తీసుకెళ్తూ, చరిత్ర, నాటకీయత, యాక్షన్‌ని మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌తో ఒక మాస్టర్‌పీస్‌ను అందించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) వంటి కీలక వ్యక్తుల దృక్పథాలతో ఈ షో రాజకీయ కుట్రల సూక్ష్మమైన అన్వేషణను అందిస్తుంది. ఈ చారిత్రాత్మక యుగాన్ని నిర్వచించిన వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లను ఇందులో చూడవచ్చు.
 
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ మొదటి ఫ్రేమ్ నుండి కూడా బిగుతైన కథనం, వివిధ పాత్రల సమతుల్య చిత్రణతో వీక్షకులను ఆకట్టుకుంటుంది. ఏదో ఒక వాదనను బలపర్చడం అని గాకుండా, నెహ్రూ, పటేల్, గాంధీ విభిన్న భావజాలాల పట్ల సానుభూతిగా ఉండేందుకు వీక్షకులకు వీలు కల్పిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం వారి విభిన్న దృక్కోణాలు సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. వారి పాత్రల చిత్రణలకు గాఢతను జోడించి, ప్రేక్షకులను ఎక్కువగా ఆలోచించేలా చేస్తాయి.
 
తిరుగులేని నటన- అద్భుతమైన దర్శకత్వం
నటీనటులు పోటీ పడుతూ నటించడం సిరీస్ ను మరొక స్థాయికి తీసుకెళ్తుంది. గాంధీ ఆదర్శవాదం, దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణను ఇది అందిస్తుంది. జవహర్‌లాల్ నెహ్రూ పాత్రకు సిధాంత్ గుప్తా తేజస్సును జోడించారు. ఆకర్షణను తీసుకువచ్చారు. గాంధీ పాత్రలో చిరాగ్ వోహ్రా ప్రతీ ఒక్క సంజ్ఞ, ఉచ్ఛారణ, వ్యక్తీకరణ సాధికారతను రేకెత్తించే విధంగా అద్భుతంగా ఉంది.
 
ముహమ్మద్ అలీ జిన్నాను తలపించేలా ఆరిఫ్ జకారియా నటించాడు. అహం, ఆశయం, తెలివిని సమతుల్యం చేస్తాడు. అదేవిధంగా ఫాతిమా జిన్నాగా ఇరా దూబే శక్తివంతమైన కోణాన్ని జోడించారు. లొంగని సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్ అద్భుతమైన నటన ప్రదర్శించారు. ల్యూక్ మెక్‌గిబ్నీ, కార్డెలియా బుగేజా ఇద్దరూ లార్డ్ మౌంట్‌బాటన్‌గా, లేడీ మౌంట్‌బాటన్‌గా మెరుస్తారు. సరోజినీ నాయుడుగా మలిష్కా మెండోన్సా తన మనోహర రూపురేఖలతో ఆశ్చర్యపరిచారు.
 
సినిమా లాంటి విజయం
ఈ షో నిర్మాణ రూపకల్పన ఓ అద్భుతం. 1940ల నాటి భారతదేశాన్ని విశేషమైన వివరాలతో కళ్ళ ముందు ఉంచారు. నిశిత దృష్టితో పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు అయినా, ప్రతి ఫ్రేమ్ కూడా సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. ప్రోస్తేటిక్స్, కాస్ట్యూమ్స్, సెట్ డిజైన్ సమానంగా లీనమయ్యేలా ఉన్నాయి. వీక్షకులు తాము నిజంగా ఆ కాలంలో ఉన్నట్లు భావించేలా చేస్తాయి.
 
అద్వానీ దర్శకత్వం వేగవంతంగా సాగుతుంది. అదే సమయంలో ఆలోచనాత్మకమైన కథనాన్ని అందిస్తుం ది. చూస్తూ ఉండగానే ఏడు ఎపిసోడ్‌లు ముగిసిపోతాయి. వీక్షకులకు అవగాహన కల్పిస్తాయి, మానసికం గా కదిలిస్తాయి. విభజన కలిగించే అనివార్యమైన బాధ నుండి దూరంగా ఉండటానికి నిరాకరిస్తూ సూటిగా, పదునైన రీతిలో కథ కొనసాగుతుంది.
 
బోల్డ్ ఫోకస్
భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఇతర అనుసరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ 1944-1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు తన పరిధిని కుదించింది. ఇది గాంధీ-జిన్నా చర్చలు, విభజనకు దారితీసిన వంటి అధిక ఆసక్తిదాయక సంఘటనలపై దృష్టి సారిస్తుంది. గాంధీ హత్యకు కొంత ముందుగానే ఆపివేయాలనే నిర్ణయం ఆ గందరగోళ సమయాల్లో చేసిన త్యాగాల భారాన్ని నొక్కి చెబుతుంది.
 
భారతీయ ‘ది క్రౌన్’
ది క్రౌన్ బ్రిటన్ రాచరికం గురించి అంతర్గత దృక్పథాలను అందించినట్లుగానే, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించి అదే పని చేసింది. ఆధునిక భారతదేశాన్ని రూపుదిద్దిన రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలకు తెర తీసింది. ఎంచుకున్న కథాంశం ఘనమైంది, కథనం మరింత ఘనంగా సాగింది. ఇది ఇటీవలి జ్ఞాపకాలకు సంబంధించి అత్యంత ఆకర్షణీయమైన సిరీస్‌లో ఒకటిగా నిలిచింది.
 
సరైన సమయంలో...
తరచుగా ఏదో ఒక పక్షం వైపు ఉండేలా వస్తున్న సౌండ్‌బైట్‌లకు చరిత్ర కుదించుకుపోతున్న యుగంలో, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది భారతదేశ గతాన్ని రిఫ్రెష్ చేస్తూ, రూపుదిద్దుకున్న అన్వేషణ. నిశితంగా పరిశోధించబడి రూపొందించబడింది. లారీ కాలిన్స్, డొమినిక్ లాపియర్ 1975లో రచించిన పుస్తకం  సారాంశంతో పాటు సినిమా నైపుణ్యాన్ని జోడించుకొని రూపుదిద్దుకుంది.
 
సీజన్ 2 ఇప్పటికే మొదలైంది. దీంతో ఈ సిరీస్ భవిష్యత్ తరాలు నేర్చుకోగల ఒక లెగసీగా మారింది. ఇది కేవలం ఒక షో కాదు-ఇది స్వాతంత్ర్యం ఖరీదు, దేశాన్ని నిర్మించిన ఆదర్శాలను గుర్తుచేస్తూ దాన్ని అందించడానికి అర్హత కలిగిన కథ. ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ అనేది పాఠ్యపుస్తకాలకు మించిన కథలు, కాలానుగుణంగా ప్రతిధ్వనించే సత్యాలను అందించే, తప్పక చూడవలసిన షో.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నయనతార, ధనుష్‌ల కాపీరైట్ వివాదం.. 24 గంటల్లో ఆ పనిచేయకపోతే?