దక్షిణాఫ్రికా టీ20 లీగ్ మ్యాచ్‌లో జోహన్నెస్‌బర్గ్ సూపర్ కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన క్యాచ్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. 40 ఏళ్ల అతను అద్భుత క్యాచ్‌తో అదరగొట్టాడు. 40 ఏళ్ల వయస్సులో గాల్లోకి దూకి క్యాచ్ పట్టుకోవడం ఆటగాళ్లను, అభిమానులను విస్మయానికి గురిచేసింది.
సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ బ్యాటర్ బెడ్డింగ్‌హామ్ ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్‌లో మిడ్-ఆఫ్ వైపు సరైన సమయంలో షాట్ ఆడినప్పుడు ఈ అద్భుతమైన క్యాచ్ దొరికింది. ఫలితంగా సోషల్ మీడియాలో డు ప్లెసిస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.
40 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ తన అత్యుత్తమ ఫీల్డింగ్ సామర్థ్యాలతో ఆకట్టుకుంటున్నాడని కితాబిస్తున్నారు. ఇటీవల, ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఈ అనుభవజ్ఞుడైన క్రికెటర్‌ను తాజా మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.