Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్రికెట్‌ కెరీర్‌కు స్వస్తి చెప్పిన విధ్వంసక వీరుడు...

క్రికెట్ నుంచి మరో సీనియర్ క్రికెటర్ గుడ్‌బై చెప్పాడు. ఆ క్రికెటర్ పేరు ఏబీ డివిలియర్స్. దేశం దక్షిణాఫ్రికా. అంతర్జాతీ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెపుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం

క్రికెట్‌ కెరీర్‌కు స్వస్తి చెప్పిన విధ్వంసక వీరుడు...
, బుధవారం, 23 మే 2018 (18:30 IST)
క్రికెట్ నుంచి మరో సీనియర్ క్రికెటర్ గుడ్‌బై చెప్పాడు. ఆ క్రికెటర్ పేరు ఏబీ డివిలియర్స్. దేశం దక్షిణాఫ్రికా. అంతర్జాతీ క్రికెట్ కెరీర్‌కు స్వస్తి చెపుతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు బుధవారం తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైరవుతున్నానని.. 114 టెస్టులు, 228 వన్డేలు ఆడినట్లు చెప్పాడు. యువకులు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్న ఏబీ.. తాను చాలా అలసిపోయానన్నాడు.
 
దీనిపై ఆయన స్పందిస్తూ, నిజానికి ఇది తన జీవితంలో తీసుకునే అత్యంత కఠిన నిర్ణయం. ఈ నిర్ణయం తీసుకునేందుకు చాలా రోజులుగా ఆలోచన చేసి, చివరకు ఈ నిర్ణయానికి వచ్చాను. మంచి ఫామ్‌‌లో ఉన్నపుడే తప్పుకోవాలని అనుకున్నాను. భారత్, ఆస్ట్రేలియాలపై సిరీస్‌ గెలిచిన తర్వాత కెరీర్‌కు స్వస్తి చెప్పేందుకు ఇదే సరైన సమయమని భావించి, ఈ నిర్ణయాన్ని వెల్లడిస్తున్నట్టు ప్రకటించాడు. 
 
ఈ సందర్భంగా 14 ఏళ్లుగా తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌‌లు, ఇతర సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. జట్టు సహచరులకు చాలా ధన్యవాదాలని చెప్పాడు. పైగా, జట్టు సహచరుల మద్దతు లేకుండా ఈ స్థాయికి వచ్చేవాడినే కాదన్నాడు. సంపాదించడం పక్కనపెడితే బాగా అలసిపోయానని.. ఇక నావల్ల కాదు అనిపించిందన్నాడు. అయితే దేశీయంగా టైటాన్స్ టీమ్‌‌కు మాత్రం ఆడతానని డివిలియర్స్ వెల్లడించాడు. 
 
కాగా, క్రికెట్‌‌లో డివిలియర్స్‌‌కు అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (16 బాల్స్), ఫాస్టెస్ట్ సెంచరీ (31 బాల్స్), ఫాస్టెస్ట్ 150 (64 బాల్స్) రికార్డులు ఏబీ పేరిటే ఉన్నాయి. సౌతాఫ్రికా తరపున టెస్టుల్లో రెండో అత్యధిక టెస్ట్ స్కోరు (278 నాటౌట్) కూడా అతని పేరిటే ఉంది. ఇక ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో అత్యధిక పాయింట్లు (935) సాధించిన సౌతాఫ్రికా క్రికెటర్ కూడా అతడే. 
 
ఇకపోతే, 114 టెస్టుల్లో 50.66 సగటుతో 8,765 రన్స్ చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. 228 వన్డేల్లో 53.50 సగటుతో 9,577 పరుగులు చేశాడు. 34 ఏళ్ల డివిలియర్స్ సౌతాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరుపున ఆడిన ఏబీ..ఆకట్టుకున్న విషయం తెలిసిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ విజేత చెన్నై కింగ్సే.. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై: ఏబీ డివిలియర్స్