Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్ పురుషులనే టార్గెట్ చేసిందా? మృతుల్లో వారే ఎక్కువ!

కరోనా వైరస్ పురుషులనే టార్గెట్ చేసిందా? మృతుల్లో వారే ఎక్కువ!
, శనివారం, 21 మార్చి 2020 (09:45 IST)
కరోనా వైరస్ దెబ్బకు చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతిదేశం వణికిపోతోంది. అలాగే, ప్రతి ఒక్కరూ గజగజ వణికిపోతున్నారు. ఎక్కడ ఈ వైరస్ సోకుతుందన్న భయం గుప్పెట్లో జీవిస్తున్నారు. ఇప్పటికే 180 దేశాలకు పాకిన ఈ వైరస్... లక్షలాది మందికి సోకింది. 
 
చైనాలోని వుహాన్ నగరంలో అంతుచిక్కని వ్యాధిగా మొదలై కరోనా వైరస్‌గా నామకరణం చేసుకున్న మహమ్మారి ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసురుతోంది. అగ్రరాజ్యాలు సైతం ఈ వైరస్ భూతాన్ని ఎదుర్కోవడానికి సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
గత డిసెంబరు నుంచి చైనా సహా ప్రపంచ దేశాలు ఈ ప్రాణాంతక వైరస్ ఉనికిపై ఓ అవగాహనకు వచ్చాయి. అయితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో ఉమ్మడి కార్యాచరణ లేకపోవడంతో బాధితుల సంఖ్య కొద్దికాలంలోనే విపరీతంగా పెరిగిపోయింది.
 
జనవరి 19 నాటికి ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 100 మాత్రమే. ఆ తర్వాత ఎంత వేగంగా పాకిపోయిందో చూస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఫిబ్రవరి 19 నాటికి కరోనా కేసులు 76 వేలకు చేరాయి. ప్రస్తుతం 183 దేశాల్లో కరోనా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 2.50 లక్షలుగా నమోదైంది.
 
అదేవిధంగా జనవరి 22 నాటికి కరోనా కారణంగా 17 మంది మృతి చెందితే, ఫిబ్రవరి 20 నాటికి 2,247 మంది మరణించారు. మార్చి 10 నాటికి ఆ సంఖ్య ఐదింతలై మృతుల సంఖ్య 10,541కి చేరింది. ముఖ్యంగా చైనా వెలుపల అత్యధిక మరణాలు ఇటలీ, ఇరాన్, స్పెయిన్ దేశాల్లో సంభవించాయి. అగ్రరాజ్యం అమెరికాలోనూ కరోనా పెద్దసంఖ్యలో ప్రాణాలను బలిగొనడం ఆందోళన కలిగిస్తోంది.
 
అయితే, ఈ మృతుల్లో ఎక్కువగా పురుషులే ఉండటం ఇపుడు దిగ్భ్రాంతి కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా, ఇట‌లీలో కరోనా ఊహించ‌ని ఉత్పాతాన్ని క‌లిగించింది. వైర‌స్ గురించి తెలుసుకునే లోపే.. జ‌నం పిట్ట‌ల్లా రాలిపోతున్నారు. యూరోప్ దేశాల్లో ఇట‌లీ దారుణంగా దెబ్బ‌తిన్నది. వైర‌స్ మ‌ర‌ణాలు ఆ దేశాన్ని క‌లిచివేస్తున్నాయి. 
 
ఇప్ప‌టికే ఆ దేశంలో సుమారు 4 వేల మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 50 వేల మందికి వైర‌స్ సోకింది. క‌రోనా కేసుల్లో చైనాను ఇట‌లీ దాటేస్తోంది. ఇట‌లీలో ఎక్కువ‌గా పురుషులే చ‌నిపోతున్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయి. మ‌హిళ‌ల క‌న్నా ఎక్కువ శాతం మంది పురుషులే వైర‌స్ వ‌ల్ల మ‌ర‌ణిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. 
 
మ‌హిళ‌లు, పురుషుల మ‌ర‌ణాల‌ మ‌ధ్య ఉన్న తేడా కొంత ఆందోళ‌న క‌లిగిస్తున్న‌ద‌ని వైట్‌హౌస్ అధికారి ఒక‌రు చెప్పారు. 50 ఏళ్లు దాటిన పురుషుల్లో ఎక్కువ మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. మరణాల రేటు రెండింత‌లు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఆ డేటా ఆధారంగా చ‌ర్య తీసుకోవాల‌ని కూడా అమెరికా ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. 
 
ఇకపోతే, క‌రోనా వైర‌స్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా మృతిచెందిన వారి సంఖ్య 11,310కి చేరుకున్న‌ది. ఆ వైర‌స్ సోకిన వారి సంఖ్య 2,72,351కి చేరుకున్న‌ది. ఇట‌లీలో మృతుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఆ దేశంలో వైర‌స్ వ‌ల్ల చ‌నిపోయిన వారి సంఖ్య 4032కు చేరుకున్న‌ది. సుమారు 47 వేల మందికి వైర‌స్ సోకింది. 
 
ఫ్రాన్స్‌లోనూ 12,612 మందికి ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చింది. 450 మంది చ‌నిపోయారు. అయితే చైనాలో మాత్రం కొత్త‌గా వైర‌స్ సోకిన వారు ఎవ‌రూ లేరు. వ‌రుస‌గా రెండో రోజు కొత్త కేసు న‌మోదు కాలేద‌ని ఆ దేశ వైద్య‌శాఖ వెల్ల‌డించింది. యూరోప్‌లో వైర‌స్ సోకిన వారి సంఖ్య ల‌క్ష దాటిన‌ట్లు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లి చేసుకుని.. రైలు పట్టాలపై పడుకుని సెల్ఫీ తీసుకున్నారు..